చిత్తూరు : పర్యాటక ప్రదేశాల్లో విడిది చేయాలంటేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. అవి w అడ్డాలుగా మారడం ఒక ఎత్తయితే.. అక్కడ విడిది చేసే జంటలకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగించేలా ఉంది.
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న హార్సిలీహిల్స్‌లో జరిగిన అలాంటి ఉదంతం పర్యాటకుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హార్సిలీ హిల్స్ గంగోత్రి దగ్గర విడిది చేసిన ఒక ప్రేమ జంటపై ఫారెస్టు ఉద్యోగులు దారుణానికి తెగబడ్డారు. ఓ ప్రేమ జంట రావడం గమనించిన ఉద్యోగులు ఆ అమ్మాయిపై కన్నేసి సమయం చూసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఒంటరిగా ఉన్న ఆ జంటను బెదిరించి వారి నుంచి నగదు లాక్కొని అమ్మాయిపై అత్యాచార యత్నం చేశారు. ప్రేమ జంట కేకల వేయడంతో ఫారెస్ట్ ఉద్యోగులు పరారయినట్టు చెబుతున్నారు.
కొండపై ఉన్న మరికొందరు యువకులు తోడు రావడంతో వెళ్లి ఆ ప్రేమజంట ఫారెస్ట్ అధికారులను నిలదీసింది. ఫారెస్ట్ అధికారులు వారి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా పంపేసింది. అఘాయిత్యానికి పాల్పడిన ఉద్యోగులు బద్రి, మనోహర్ అని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అమ్మాయిది అనంతపురం జిల్లా కదిరి. అంగళ్లులో ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతూ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటునట్టు తెలిసింది. ఆ అబ్బాయిది చిత్తూరు జిల్లా మదనపల్లె.