అరుంధతి అనగానే అనుష్క గుర్తొస్తుంది. సినిమా ఆధ్యాంతం తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి… జేజమ్మగా, అరుంధతిగా అనుష్క తనకంటూ చిత్రసీమలో ప్రత్యేక పేజీని రాసుకోగలిగింది. అనుష్క కెరీర్ అరుంధతికి ముందు, అరుంధతి తర్వాత అని లెక్కలేసుకుంటున్న తరుణంలో ఇంట్రెస్టింగ్ విషయం భయటకొచ్చింది.
అరుంధతి స్క్రిప్ట్ రెడీ అయ్యాక చిత్ర యూనిట్ ముందుగా కలిసింది మమతా మోహన్ దాస్ ని. అప్పటికే యమదొంగ సినిమాలో కాస్సేపు యముడిపాత్రలో నటించటంతో ఆమెను పెడితే బాగుంటుందని అనుకున్నారు. ఆమె కూడా మొదట సినిమాకు ఓకే చెప్పింది. కానీ ఈ మూవీకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలని, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న సినిమా అంత హిజీగా పూర్తికాదని… ఈ లోపు మరో రెండు, మూడు సినిమాలు తీసుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహాతో మమతా సినిమా నుండి తప్పుకుంది.
దీంతో ఈ ఆఫర్ అనుష్క ముందుంచగా… కథ వినగానే మరో ఆలోచన లేకుండా సినిమాకు ఓకే చెప్పింది. అలా అనుష్క అరుంధతిగా మారింది.