కుక్కలను, పిల్లులను లేదా మరికొన్ని జంతువులను గమనిస్తే వాటికి మీసాలు ఉంటాయి. మిగిలిన వెంట్రుకల కంటే కూడా అవి బలంగా ఉండటమే కాకుండా మూడు రెట్లు లోపలి ఉంటాయి. ఈ వెంట్రుకల చివరన మిగిలిన వెంట్రుకుల మాదిరిగా కాకుండా, నాడుల కలయిక ఉంటుంది. వీటిని విబ్రిసే అని పిలుస్తారు. వాస్తవానికి లాటిన్ లో “విబ్రియో” అంటే కదలటం అని అర్ధం. అయితే ఇవి వాటి అంతట వాటిగా సమాచారాన్ని ఇవ్వడం కుదరదు.
Also Read:సినీ నటి మీనా సంచలన నిర్ణయం ?
ఏ గాలికో ,ఇంకేదైనా తగలటం వంటివి జరగడంతో మాత్రమే వాటిలో స్పందన వచ్చి మెదడుకి సమాచారాన్ని పంపిస్తాయి. ఇలాంటి వాటిని “ప్రోప్రియో రిసెప్టార్” అని పిలుస్తారు. మిగతా వెంట్రుకల మాదిరి వీటిని కట్ చేయకూడదు. చీకట్లో అవి వెళ్ళే సమయంలో గాని ఇరుకైన ప్రదేశాల్లో గాని వెళ్ళే సమయంలో వాటికి ఈ వెంట్రుకల నుంచే ఒక అంచనా అనేది అందుతుంది.
గాలి వేగాన్ని,గాలిలో ఉండే ఒత్తిడిని ఇవి పసిగట్టి, ముందున్న ప్రాంతాన్ని అంచనా వేస్తాయి. ఆ ప్రాంతానికి తగిన విధంగా తమ శరీరాన్ని మారుస్తాయి. కొన్నిసార్లు ఈ మీసాలకు, ఏదైనా తగిలితే గనుక కనురెప్పలు వెంటనే మూసుకుంటూ ఉంటాయి. వాటి కళ్ళకు కూడా దీనితో భద్రత అనేది ఉంటుంది. ఉదాహరణకు పిల్లి ఏదైనా చిన్న రంద్రంలో నుంచి వెళ్తుందా లేదా అనేది వాటి నోటికి ఉండే మీసాల ద్వారా ఆ మార్గాన్ని అంచనా వేసుకుని వెళ్తుంది. కొన్ని జంతువులకు ఇవి ముందు కాళ్ళ పై ఉంటాయి. ఇవి స్పర్శకు కూడా రియాక్ట్ అవుతాయి.
Also Read:నరేష్ పవిత్ర లోకేష్ ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ? షాక్ అవ్వాల్సిందే!!