ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఇదే అదునుగా అక్రమార్కులు నకిలీ వ్యాక్సిన్లను తీసుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వ్యాక్సిన్లపై సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్లు నకిలీలున్నాయని ప్రపంచవ్యాప్తంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా దర్యాప్తు ప్రారంభించింది.
దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లలో ఎవి అసలు, అవి నకిలీ అని తెలుసుకునేందుకు కొన్ని అంశాలతో కూడిన సీక్రెట్ నోట్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. కంపెనీ నుండి వచ్చే బ్యాచ్ నెం, కలర్, గుర్తులను కలిసి ఈ నోట్ తయారు చేసినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
నకిలీ వ్యాక్సిన్ల గుర్తింపుపై ఎప్పటికప్పుడు కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.