మన దేశంలో హిల్ స్టేషన్లకు కాస్త ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఊటి, కొడైకెనాల్, డార్జిలింగ్ సహా ఉత్తర భారతంలో కొన్ని ప్రదేశాలు… హిల్ స్టేషన్లకు బాగా ప్రసిద్ది చెందాయనే చెప్పాలి. ఆయా ప్రాంతాలను క్రమంగా టూరిస్ట్ ప్రాంతాలుగా కూడా అభివృద్ధి చేసారు. అసలు ఆ సంస్కృతి మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటీ అనేది చూద్దాం.
Also Read:సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం…!
మన దేశంలో హిల్ స్టేషన్లు బ్రిటిష్ వారి వారసత్వం అనే చెప్పాలి. బ్రిటిష్ అధికారులు, వారి కుటుంబాలు వేసవిలో సేద తీర్చుకోవడానికి ఏర్పరుచుకున్న ఆవాసాలుగా చెప్తారు. సిమ్లా, ఊటి, డార్జిలింగ్, ముస్సోరి సహా కొన్ని ప్రాంతాలు అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి. ప్రతి బ్రిటిష్ నిర్మిత హిల్ స్టేషన్ కు ఉండే కొండ గుర్తులు కొన్ని ఉన్నాయి. బ్రిటీష్ అధికారులు తమ మిత్రులను ఒకప్పుడు ఇక్కడే కలుసుకునే వారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి ఆతిధ్యం కూడా ఇక్కడే ఇచ్చే వారు. ఇక చాలా హిల్ స్టేషన్లలో భారతీయులకు ప్రవేశం ఉండేది కాదు. ఊరికి అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించే వారు. వీటిని ఆనుకునే బ్రిటిష్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలు, ఉన్నత వర్గ వ్యాపారాలు నిర్మించే వారు. ఇక కొండ దిగువున భారతీయుల ఆవాసాలు ఉండేవి.
ఇక వాటిని బ్రిటీష్ వారు తమకు అనుకూలంగా బాగానే అభివృద్ధి చేసుకున్నారు. బ్రిటిష్ వారు చాలా హిల్ స్టేషన్లలో మైదాన ప్రాంతాల నుండి రైల్వే లైన్లు వేసి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసారు. సిమ్లా, ఊటి వంటి ప్రాంతాలకు స్టేషన్ లు నిర్మించారు. మీరు గమనిస్తే బ్రిటీష్ వారి గురించి తీసిన సినిమాలు ఎక్కువగా… కొండ ప్రాంతాల మీదనే ఉంటాయి.
Also Read:గ్యాస్ సిలెండర్ పేల్చి కావాలనే చంపేసారా?