టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి ఒక పక్క ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంటే, మరో పక్క అంతే రాజకీయ అంశంగా మారింది.
ఆయన గుండెపోటుతో మరణించారు అనే వార్తలు మొదట వినిపించినప్పటికీ, ఆత్మహత్య అనే విషయం త్వరగానే బయటకు వచ్చింది.
సహజ మరణం కాదు అని తెలియగానే, రక రకాల రాజకీయ స్వరాలూ వినిపిస్తున్నాయి. ఒక పక్క జగన్ సర్కారు పెట్టిన హింస భరించలేక అంత పెద్ద లీడర్, 72 ఏళ్ల వయసులో ఆత్మాహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క కొడుకుతో వున్నా తగాదాలే కారణం అనే వదంతును వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. పైగా, మంత్రి బొత్సా అసలు బసవతారకం హాస్పిటల్ కు ఎందుకు తీసుకొచ్చారు, ఈ మరణం వెనుక ఎదో కుట్ర ఉంది అని, తెలంగాణా ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని కోరారు.
ఇంతలో హైదరాబాద్ సీపీ అంజాన్ కుమార్ కూడా కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతి పై కేసు నమోదు చేశామని అన్నారు. మృతి వెనుక నిజాలు తెలుసుకోవడానికి మూడు టీమ్ లతో దర్యాప్తు మొదలుపెట్టారు. బంజారాహిల్స్ ఏసీపీ కే ఎస్ రావు అద్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుంది అని అంజనీ కుమార్ చెప్పారు.
క్లూస్ టీం, టెక్నీకల్ టీమ్ లు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.