నీలోఫర్ ఆస్పత్రి” బహుసా హైదరాబాద్ గురించి కొంచెం తెలిసినా సరే ఈ ఆస్పత్రి పేరు వినే ఉంటారు. ఈ ఆస్పత్రికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ఒక్కసారి చూద్దాం. దాని కంటే ముందు నీలోఫర్ అంటే అర్ధం తెలుసుకోవాలి. నిలోఫర్ అర్ధం ఏంటంటే నీలి కలువ పువ్వు అని. యువరాణి నిలోఫర్ ఫర్హత్ బేగం సాహెబా. హైదరాబాద్ నిజాం యువరాజు మొజాం ఝాకు మొదటి సతీమణి. అతని పేరు మీదనే ఇప్పుడు కోటీ- అబిడ్స్ మధ్యలో ఉండే మొజాం ఝా హీ మార్కెట్ నడుస్తుంది.
నిలోఫర్ ఇస్తాంబుల్ లో 1916లో పుట్టి ఆ తర్వాత పారిస్ లో పెరిగి అక్కడి నుంచి 1931లో వివాహం తర్వాత హైదరాబాద్ వచ్చింది. ప్రపంచంలో ఉండే టాప్ 10 అందగత్తెలలో ఆమె మూడో వారు. వివాహం తర్వాత యువరాజుతో ఆమెకు పిల్లలు లేరు. అయితే ఆమెకు స్త్రీలన్నా, ఆడ పిల్లలన్నా సరే గౌరవం ఎక్కువగా ఉండేది. ఈమె దగ్గర పని చేసే ఒక మహిళకు బిడ్డ పుట్టి పురిట్లోనే ప్రాణం కోల్పోయింది. దానికి కారణం… వైద్య సౌకర్యాలు లేకపోవడమే.
వెంటనే యువరాణి నిలోఫర్, తమ మామ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో మాట్లాడి హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ ప్రాంతంలో ప్రసూతి ఆసుపత్రి కట్టించింది. అక్కడ గర్భం తో వచ్చేవారికి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె పేరునే నీలోఫర్ ఆస్పత్రిగా పెట్టారు. మొజాం ఝా తో పెళ్లయిన 21 ఏళ్ళు అయినా ఆమెకు పిల్లలు పుట్టకపోవడంతో రాజు మరొకరిని వివాహం చేసుకోగా ఆమెకు ఇద్దరు పిల్లలు పెట్టారు. ఆ తర్వాత 70 వేల డాలర్లు భరణం తీసుకుని… తల్లి దగ్గరకు వెళ్ళింది. వ్యాపారవేత్త, సినీ ప్రొడ్యూసర్ అయిన “ఎడ్వర్డ్ జూలియస్ పోప్ జూనియర్” ని 1963 లో పెళ్లి చేసుకుని 1989 లో ఆమె కన్ను మూశారు.
Also Read: అదేం భాష కేసీఆర్.. తెలంగాణ పరువు పోగొట్టొద్దు.. రేవంత్ సెటైర్లు