పోసాని కృష్ణ మురళి అంటే ఇప్పుడు చాలా మంది కామెడిగా చూస్తున్నారు గాని ఒకప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉండేది. దర్శకుడిగా, రైటర్ గా ఆయనకు చాలా డిమాండ్ ఉండేది. అగ్ర హీరోలకు మంచి కథలు, మాటలు అందించారు. ఇప్పుడు పని చేస్తున్న ఎందరో యువ దర్శకులకు ఆయన గురువుగా చెప్తూ ఉంటారు. ఆయన తీసిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా చాలా మంది కెరీర్ నిలబెట్టాయి.
వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ కొట్టిన బాబి కూడా ఆయన దగ్గరే పని చేసారు. ఇక పోసాని కృష్ణ మురళి ఎలా సినిమా పరిశ్రమలోకి వచ్చారో చూద్దాం. ఆయన చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి సినిమాల ఆసక్తితో అడుగులు వేసారు. చెన్నైలోని పాండి బజార్ అంటే సినిమా వాళ్లకు కూడా ఫేమస్. ఇక చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ అద్దెకు ఉండేవారు. ఇలా పోసాని కృష్ణ మురళి కూడా అద్దెకు ఉన్నారు.
బ్రహ్మాజీ అద్దెకు ఉండే గది ఎదురుగా పోసాని కూడా అద్దెకు ఉండేవారు. ఆ తర్వాత స్లోగా పరుచూరి గోపాల కృష్ణతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజులు మార్గదర్శిలో పని చేయగా అదే సమయంలో ఆయన తండ్రికి ఆరోగ్యం విషమించింది. దీనితో ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన పోసాని కెరీర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మధన పడేవారు. పరుచూరితో ఉన్న అనుబంధంతో ఆయన సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు.