టాలీవుడ్ లో జయసుధ, జయప్రదకు మంచి గ్లామర్ ఇమేజ్ ఉంది. అప్పట్లో వీళ్ళు సినిమా చేస్తే సూపర్ హిట్ అనే భావన కూడా ఉండేది. జయప్రద బాలీవుడ్ కి కూడా వెళ్లి విజయవంతం అయ్యారు. ఇక జయసుధ ఇక్కడే ఉండి అన్ని రకాల పాత్రలు చేసి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికి కూడా ఆమెకు ఉన్న క్రేజ్ తగ్గలేదు అనే చెప్పాలి. హీరోయిన్ గా అప్పట్లో అందరితో చేసారు.
అయితే జయసుధ అప్పట్లో మంచి సినిమాలను వదులుకున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు ఆమె బిజీగా ఉండి వేరే హీరోలతో సినిమాలను చేసేవారు. ఈ క్రమంలో టైం ని కూడా ఆమె సరిగా వినియోగించుకోలేదు అనే అభిప్రాయం ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో చేసినా కొన్ని సూపర్ హిట్ సినిమాలకు, చరిత్ర్ సృష్టించిన సినిమాలకు దూరం అయ్యారు.
అలా సాగర సంగమం సినిమాకు దూరం అయ్యారు ఆమె. ముందు కె విశ్వనాథ్ ఆమెతోనే సినిమా చేయాలి అనుకున్నారు. కథ కూడా చెప్పగా ఆమె ఓకే చేసారు. అయితే కమల్ హాసన్ బిజీగా ఉండటంతో కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది అప్పట్లో. దీనితో జయసుధ వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్ ఫ్రీ అయ్యారు. కాని జయసుధ మాత్రం ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఆమె కోసం ఆగాలి అనుకున్నా… కమల్ హాసన్ తర్వాత బిజీ అయితే ఇబ్బంది అని భావించి… జయప్రదను తీసుకున్నారు.