మన దేశంలో ఒకప్పుడు ఆడపిల్ల అంటే భయం ఉండేది. వారసుడు ఉండాలని చాలా పట్టుబడుతూ ఉంటారు ఇప్పటికి కూడా. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆటవిక సంస్కృతి ఇంకా కొనసాగుతుంది. ఇక ఉత్తరాదిలో అయితే పది మంది ఆడపిల్లలు పుట్టినా మగపిల్లాడు లేడని మరో కాన్పు కోసం ట్రై చేసే మృగాలు ఉన్నాయి. బంధువులు కూడా ఇటువంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు.
Also Read:విమానానికి ఆ మేఘాలు అడ్డొస్తే ఏం జరుగుతుంది…?
ఇక అబద్దం ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే ఒక సామెత మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. అసలు ఆ సామెత ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆడపిల్ల పుట్టడం అనేది ఒకరకంగా పూర్వం శాపంగా భావించే వారు. ఆడపిల్ల రక్షణ గతంలో పెద్ద విషయం కాదు గాని వారికి వివాహం చేయడం పెద్ద సమస్య. ఆడపిల్లలను చదివించకుండా త్వరగా వదిలించుకోవాలని చాలా మంది భావించే వారు.
ఎంత చదివించినా సరే అమ్మాయి పెళ్లి తర్వాత అత్త గారింటికి వెళ్లిపోతుంది. ఆమెను కష్టపడి పెంచి, చదివించి, బాగా ఖర్చు చేసి పెళ్లి చేస్తే అక్కడ సేవలు చేస్తుంది అనే భావన బాగా పెరిగింది. ఆడపిల్ల పుట్టడం అనేది పూర్వం ఇదో కలసి రాని శ్రమగా భావించేవారు. అందుకేనే ఆడపిల్ల అయినా సరే… ఆమెను కన్నవారిని అయినా జాలిగా, లోకువగా చూసే విధానం క్రమంగా పెరిగి ఇప్పటికి కూడా కొనసాగుతుంది.
చివరికి అబద్ధాలు ఆడిన వాళ్లకు ఆడ పిల్లలు పుడతారు అనే మాటను సామెతగా మార్చేసారు. ఆడపిల్ల పుడితే నీకు కలిసి రాదూ అని చెప్పే ఉద్దేశంలో భాగంగా అలా శపించే వారు. దాన్ని ఒక శాపంగా భావించి భయపడే వాళ్ళు కొందరు.