కులం పేర్లకు మన దక్షినాది బాగా ప్రసిద్ది. ఉత్తరాది లో కూడా కొన్ని కులాలకు పేర్లు పెట్టి వాటిని పేరు చివర తగిలించుకుంటారు. పాటిల్, పటేల్, గుజ్జర్లు, నాయర్లు, నాయక్ లు ఇలా తమ కులం పేర్లను తమ పేరు చివర పెట్టుకుంటూ ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అలా పెట్టుకోవడం ఒక గౌరవంగా భావిస్తారు. ఇక నాయుడు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది.
‘నాయుడు’ కాపులకు, కమ్మ వారికి, వెలమలకు, అలాగే మరి కొన్ని కులాలకు వాడుతూ ఉంటారు. అసలు నాయుడు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. నాయుడు అనే మాట ఉద్భవించింది ‘నాయకుడు’ అనే పిలుపు నుంచి. రాజరిక వ్యవస్థలో క్షత్రియ ధర్మం నిర్వహిస్తూ సమాజంలో వ్యవసాయ వ్యవస్థలో భూస్వామికులుగా, గుడుల సంస్కృతిలో వాటి పోషణకు ధర్మకర్తలుగా, సైన్యాధిపత్యం సాగిస్తూ ముఖ్యులుగా ఉండే వారికి నాయుడు అని చేర్చారు.
మధుర ‘నాయక రాజులు’ దీనికి ఒక ఉదాహరణ. ‘చౌదరి’, ‘రావు’ మునుపటి ‘నాయుడు’ పదానికి ‘ఆధునికత’ పరమైన మార్పులుగా చెప్పాలి. ఇక, ‘రాజు’ పదం ‘రాయ’, ‘రే’, ‘రాయలు’ మరియూ ‘రావు’ గా రూపాంతరం చెందడం జరిగింది. అయితే కొన్ని కులాలకు నాయుడు ఉండటంతో దాన్ని మార్చుకుని తమ కులం పేరు పెట్టుకుంటున్నారు.