ఊర్లకు పెట్టే పేర్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. గ్రామాలకైనా పట్టణాలకు అయినా సరే పలు కీలక అంశాలను ప్రధానంగా తీసుకుని పేర్లు పెడుతూ ఉంటారు. వాటి చరిత్ర, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, ఆ ఊర్లకు సేవ చేసిన వాళ్ళు లేదా దేనికి అయినా గుర్తుగా ఇలా ఊరి పేర్లను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టిన పేర్లు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఏంటి ఆ ఊరి పేర్లు అవి ఎలా వచ్చాయో తెలుసుకుందాం.
Also Read:హన్మకొండ బిజెపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత
బోనకల్ అనే ఊరు గాని లేదంటే డోర్నకల్ అనే విజయవాడలో ఉండే రోడ్డు పేరు గాని రావడానికి ఒక బలమైన కారణం ఉంది. కల్ అంటే రాళ్లు రప్పలతో ఉన్న ప్రదేశం అని అర్ధం వస్తుంది. దక్కన్ పీఠభూమిలోని ఎన్నో గ్రామాలకు రాళ్లు, రాయి, రాయ, ఉప్పల్, శిల, కొండ అనే రాయిని ప్రతిబింబించే విధంగా పేర్లు పెట్టేవారు. విజయవాడలో ఉండే ఒక రోడ్డుకి డోర్నకల్ రోడ్డు అని పేరు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లోనే కాక తెలంగాణలో కూడా ఈ పేరు ఉంటుంది. ఇక రాళ్లపల్లి అనే పేరు ఉన్న ఊరు ఉంది. రాళ్ళపల్లి అని అనంతపురంలో అలాగే పులికుంట్ల రాళ్ళ పల్లె అని ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అలాగే కొండపల్లి విజయవాడ పరిధిలో ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ లో భాగం కాని ఉప్పల్ కు కూడా అలాగే పేరు వచ్చింది. కల్ అంటే తమిళ్ లో రాయి అని అర్ధం వస్తుంది. గుంతకల్, న్యాల్ కల్ (సంగారెడ్డి), డోర్నకల్ వగైరాలు దీనికి ఉదాహరణలు. ఇక విజయవాడలో ఉన్న డోర్నకల్ రోడ్ లో ఒకప్పుడు రాళ్ళు రప్పలు ఉండేవి అంటారు. అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తారు.