పులిపిరులు అనేవి చాలా మందికి పెద్ద సమస్య. వాటిని కంట్రోల్ చేయడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు. అయినా సరే అవి తగ్గకపోగా ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అసలు పులిపిరులు ఏ విధంగా వస్తాయి…? అవి కంట్రోల్ కావాలంటే మనం ఏం చేయాలి…? అసలు మన శరీరంపై పులిపిరి ఎలా పుడుతుందంటే మనలో యాంటీ బాడీస్ మన లోపలికి వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ని ఆపి యుద్ధం చేస్తాయి.
Also Read:ఉల్లిపాయతో నిజంగా జ్వరం వస్తుందా…?
అలా చేసే క్రమంలో కొన్ని డెడ్ వైరస్ మూలకాలు ఒక చోటికి చేరి పైకి వస్తాయి. అవి కొన్ని రకాల నల్ల మచ్చలుగా, కొన్ని రఫ్ గా బుడిపెలుగా ఏర్పడి చర్మం పైన కనపడతాయి. వీటిని పులిపిర్లు అని పిలుస్తాం. వీటితో ఏ ప్రమాదం ఉండదు గాని… కొన్నిసార్లు ఈ వైరస్ లు జీవకణాలు వృద్ధి చేసుకొని లోపలి నరం వరకు వ్యాప్తి చెందితే మాత్రం ఇబ్బంది పెడతాయి. ఆ భాగానికి కొంచెం గట్టిగ స్పర్శ తగిలితే నొప్పి వస్తుంది.
మరికొన్ని చాల సున్నితంగా ఉండి రక్తం కారుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉంటే మాత్రం డెర్మటాలజిస్ట్ ను కలవడం మంచిది. ఇక వాటి గురించి తెలుసుకోవాల్సిన కీలక విషయం… పులిపిరులు అనేది ఒక అంటువ్యాధి రకం. ఒకరికి ఉన్న పులిపిరులని మరొకరు తాకినా లేదంటే వారి తువ్వాలు, బట్టలు వాడిన సరే ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. షేవింగ్ చేసుకున్నాక పట్టిక రాయితో రుద్దుకోవడం ద్వారా పులిపిరులు రాకుండా కొంత వరకు కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. చాలా పులిపిరులు వాటంతట అవే పోతాయి గాని మరికొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి.