ఆఫ్ఘనిస్తాన్” ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ బహుసా ఈ దేశ ప్రజలే అనుభావిస్తారేమో. ప్రభుత్వ పరంగా, ఉగ్రవాదం పరంగా ఆ దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. ఇటీవల వచ్చిన భూకంపం దెబ్బకు దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అక్కడ భూకంపాలు కామన్ కాదు అని చరిత్ర చెప్తుంది. గతంలో వచ్చిన ఎన్నో భూకంపాలు ఆ దేశానికి తీవ్ర విషాదమే మిగిల్చాయి.
Also Read:ఎన్టీఆర్ రాజకీయాల్లో అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటీ…?
ఇటీవల వచ్చిన భూకంప తీవ్రత ఆరు లోపే ఉన్నా సరే దాని నష్టం మాత్రం తీవ్రంగా ఉంది. అసలు అక్కడ ఎందుకు భూకంపాలు వస్తాయో చూద్దాం. భూమి ఉపరితలంపై ఉండే క్రస్ట్ లో ఉండే టేక్టానిక్ ప్లేట్స్ లో అకస్మాత్తుగా కదలిక వచ్చినప్పుడు భారీ స్థాయిలో శక్తి వస్తుంది. ఆ శక్తి తరంగాల రూపంలో భూమి మీదకు చేరుకొని భూమి కంపిస్తే విడుదల అయ్యే శక్తి ఆధారంగా తీవ్రత ఉంటుంది.
హిమాలయాల్లో ఉండే హిందూకుష్ రీజియన్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. అక్కడే ఇండియన్, యూరేసియన్ ప్లేట్స్ కలయిక జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువగా భూపలకలు కదిలే ప్రాంతం హిందూ కుష్. అక్కడ భూకంపం వచ్చిన ప్రతీసారి వందల మంది ప్రాణాలు కోల్పోతారు. దానికి ప్రధాన కారణం, అక్కడ ఉండే భవనాలు భూకంపాన్ని తట్టుకుని నిలబడే విధంగా నిర్మాణం జరగదు.
అందుకే అక్కడి ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారట. అయితే జపాన్ లో వచ్చే భూకంపాల కంటే ఆఫ్ఘన్ లో వచ్చేవి తక్కువే అయినా అక్కడ ప్రజలకు అందే సహాయ కార్యక్రమాల లోపం కారణంగా కూడా ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల వచ్చిన భూకంపం తీవ్రత హీరోషీమాపై అమెరికా వేసిన అణుబాంబు తీవ్రత కంటే 37 రెట్లు ఎక్కువట.
Also Read:మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. ఈశ్వర్ ఎన్నిక చెల్లదా..?