చాలా మంది బీచ్ కు వెళ్తారు గాని అసలు బీచ్ లో అలలు ఎందుకు వస్తాయనేది చాలా మందికి తెలియదు. దానికి కారణం ఏంటో చూద్దాం. ముందుగా తెలుసుకోవాల్సిన విషయం అలలు ఏర్పడటానికి కారణం గాలి. గాలి కారణంగా కలిగే తరంగాలు, ఉపరితల తరంగాలు, గాలికి – ఉపరితల నీటికి జరిగే ఘర్షణతో పుడతాయట. ఘర్షణ కారణంగా… శక్తి, శక్తి కారణంగా తరంగాలు, తరంగాల కారణంగా వల్ల నీరు వృత్తాకారంలో కదులుతూ ఉంటాయి.
Also Read:విజయవాడకు బెజవాడ అనే పేరు ఎలా వచ్చింది…?
వాస్తవానికి నీరు తరంగాల్లో ప్రయాణించే అవకాశం లేదు. తరంగాలు సముద్రం అంతటా నీటిని కాకుండా శక్తిని ప్రసారం చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఏ శక్తి అడ్డుకోకపోతే గనుక అవి సముద్రపు బేసిన్ లో ప్రయాణించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. చూడటానికి అలలు నీటిని ఒక చోట నుండి ఇంకో చోటికి రవాణా చేస్తున్నట్టుగా ఉంటాయి గాని… అది నిజం కాదు. అక్కడ ఉండేది శక్తి మాత్రమే.
సముద్ర ఉపరితలంపై గాలి వీచే సమయంలో నీటి ఉపరితలం – గాలి దిగువ పొరపై గురుత్వాకర్షణ శక్తిని ప్రయోగిస్తుంది. అక్కడి నుంచి ఇంకొంచెం పై పొరపై పూర్తి ప్రభావం చూపిస్తుంది. చివరికి పై పొరకు చేరుకుంటాయి. గాలిలోని ప్రతీ పొర, గాలి వేగంలోని వైవిధ్యం కారణంగా, గురుత్వాకర్షణ శక్తి కారణంగా…, పై భాగంలోని పొర ముందుకు వెళ్తుంది. అందుకే వృత్తాకార చలనం అనేది సముద్రంలో ఏర్పాటు అవుతుంది. ఇక ముందువైపు క్రిందకి, వెనుకవైపున పైకి ఒత్తిడి కారణంగా ఒక తరంగం ఏర్పాటు అవుతుంది. దానినే మనం అల అని పిలుస్తాం.
Also Read:ఫుడ్ పాయిజన్ ఘటనలపై షర్మిల ఫైర్