మనం సినిమాల్లో రాబందులను గమనిస్తే శవం కనపడగానే ఎగబడి వచ్చేస్తు ఉంటాయి. అసలు రాబందులకు శవాలు ఉన్నాయని, కుళ్ళిన మాంసం ఉందని ఏ విధంగా తెలుస్తుంది…? అసలు అంత కుళ్ళిన మాంసాన్ని రాబందులు తింటే ఏ విధంగా జీర్ణం చేసుకుంటాయి అనేది చాలా మందిలో ఉన్న సందేహం.
Also Read:ఆస్తమా ఉందా…? ఈ విషయాలు అసలు మర్చిపోవద్దు…!
కళేబరాలు విడుదల చేసే గంధక సంబంధ రసాయన మిశ్రమాల వాసనను రాబందులు మైలు దూరంలో కూడా ఈజీగా గుర్తిస్తాయి. అంతే కాకున్న్డా కళేబరాన్ని కనిపెట్టిన డేగల వంటి పక్షులను దూరం నుంచి చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ సరైన ప్రదేశాన్ని గుర్తించి వాలిపోతాయి. ఇక వాటికి ఉండే కొన్న్ని ప్రత్యేకతలు వాటికి ప్రధాన బలం. అవి పూర్తిగా మాంసాహారులు.
అతి తక్కువ శ్రమతో ఎంతో ఎత్తున ఉష్ణవాయు తరంగాలపై తేలుతూ గంటల తరబడి ఎగురుతాయి. వాటికి తల, మెడపై ఈకలు లేకపోవడం మరో బలం. కుళ్ళిన కళేబరాలను తినే సమయంలో వాటిలోని బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఈకల అడుగు భాగానికి చేరుకుని ఇంఫెక్షన్లు రావు. రాబందుల కడుపులోని ఆమ్లాలు సగటు కంటే ఎంతో శక్తివంతమైనవిగా చెప్తారు వైద్యులు.
బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను ఆ ఆమ్లాలు చంపేస్తాయి. అందుకే కుళ్ళిన మాంసం తిన్నా సరే వాటికి సులభంగా అరుగుతుంది. ఆహార కొరత ఉంటే చిన్న జంతువులపై దాడి చేసి చంపి తినేస్తాయి. గ్యాస్ పైప్ లైన్లలో లీకులను కనిపెట్టేందుకు కొన్ని సంస్థలు రాబందులను కూడా వాడతాయి. దీనికి ఇథైల్ మెర్కప్టన్ అనే ఒక రసాయనాన్ని గ్యాసులో కలిపితే రాబందులు ఈ వాసనను కుళ్ళిన మాంసం వాసనగా భ్రమపడి అక్కడకు వేగంగా వస్తాయి.
Also Read:భారీ భూకంపం.. 1000 మంది మృతి