యుక్త వయసులో ఉన్న వాళ్లకు మొటిమలు రావడం అనేది సాధారణం. కొందరిలో రావచ్చు, కొందరిలో లేకపోవచ్చు. కొన్ని రోజులకు ఇవి సాధారణంగా తగ్గిపోతాయి గాని తగ్గవు అనే భయం చాలా మందిలో ఉంటుంది. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం.
పింపుల్స్ యుక్తవయస్సు లో సర్వసాధారణ సమస్య అనే దానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. పింపుల్స్ వచ్చాయని బాధ అవసరం లేదు. మన శరీరంలో తైల గ్రంధులు ఉండటంతో… శరీరం తేమగా ఉండడానికి సహకరిస్తాయి. ఈ తైల గ్రంధులు ఆయిల్ ని అధికంగా ఉత్పత్తి చేసే సమయంలో వీటికి బాక్టీరియా తోడైతే గనుక అవి మొటిమలుగా మారతాయి.
Also Read: అసలు తిరుమలకు కాలి నడకన ఎన్ని దారులు…?
తైల గ్రంధుల ప్రభావం ముఖం, మెడ, ఛాతీ, వీపు ప్రాంతాల్లో ఎక్కువ. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకు మొటిమలు కనపడతాయి. వీటిని నొక్కడం మంచిది కాదు. మచ్చలుగా మారే అవకాశం ఉంటుంది. ఇక ఆహారపు అలవాట్లు, జీవన శైలిని ఒక పద్దతిలో పెట్టుకోవడం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. పై పూతల ద్వారా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది.
నూనె ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటమే కాకుండా నాన్ వెజ్ ని కొన్ని రోజులు మానేసి తేలికగా జీర్ణం అయ్యేవి తినాలి. నీళ్ళు ఎక్కువగా తాగడం కూడా మొటిమలకు మంచి పరిష్కారం. తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తినడం అలాగే మలబద్దకం లేకుండా చూడటం, బత్తాయి రసం రోజు తాగడం వంటివి చేయాలి.