మన తెలుగు వారే కాదు గాని దేశంలో చాలా మంది ఇంగ్లిష్ లో కొన్ని పదాలను బాధ పడే విధంగా పలుకుతూ ఉంటారు. ఎలా పడితే అలా మాట్లాడుతూ ఆ పదాలను సరిగా పలికే వారికి కూడా చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఊరి పేర్ల విషయంలో కూడా వింతగా పలుకుతూ ఉంటారు. గుంటూరు ని గుంటూర్, సూర్యాపేట్, చిలకలూరిపేట్, నరసరావు పేట్ అంటూ కాస్త స్టైల్ గా పలికే ప్రయత్నం చేస్తారు.
Also Read: దుక్కి వాన అంటే ఏంటీ…? ఏ విధంగా లెక్క పెడతారు…?
ఇక ఇంగ్లిష్ అక్షరాల విషయంలో కూడా ఇలాగే వింతగా పలుకుతారు. H ను పలికే విషయంలో భిన్నంగా పలుకుతూ ఉంటారు. మన తెలుగు వారిలో ఎక్కువమంది “హెచ్” అని అంటారు. వేరే వాళ్ళు ఎచ్ అని పలుకుతు ఉంటారు. ఇందులో ఏది ప్రామాణికమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. H అనే ఇంగ్లీషు అక్షరాన్ని “హెచ్” అని పలకడం నూటికి నూరు పాళ్ళు తప్పు. దాన్ని కచ్చితంగా “ఎచ్” అనే పలకాలి.
తెలుగు వాళ్లలో ఉన్న మరో వింత పదం new ని పలకడం. వాస్తవంగా చెప్పాలి అంటే… దీనిని నూ అని పలకాలి. కాని మనం అక్షరాలను పట్టుకుని న్యూ అంటాం. ఉదాహరణకి తీసుకుంటే… నూటన్ అంటే సరిపోతుంది కాని న్యూటన్ అని పలుకుతూ ఉంటారు. అలాగే news విషయంలో కూడా న్యూస్ అనాల్సిన అవసరం లేదు. నూస్ అని పలికితే చాలు. అదే విధంగా @ ని పలికే సమయంలో at అని అంటే చాలు. at the rate of అంటారు. అది కచ్చితంగా తప్పే.
Advertisements
Also Read: లోకేష్ జూమ్ మీటింగ్.. వైసీపీ లీడర్స్ హల్ చల్