డిస్కవరీ ఛానల్ లో జింకను చిరుతపులి వేటాడుతుంటే చూడటానికి మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చిరుత పులి కంటే జింక స్లో గా పరుగులు తీసినా సరే చిరుతకు మాత్రం జింకను పట్టుకోవడం ఒక సవాల్ అనే చెప్పాలి. జింక ను పట్టుకోవడానికి మాటు వేసి గుంపులో పట్టుకుంటుంది చిరుత. సింగిల్ గా ఉన్న వాటి మీద వేటకు వెళ్లే సాహసం చేయదు. జింక విషయంలో చిరుత ఎందుకు ఓడిపోతుంది…?
జింకను పట్టుకుంది అనుకునే టైం లో తప్పించుకుంటుంది. జింక కంటే చిరుత వేగంగా పురుగులు తీసినా సరే చివరి క్షణంలో జింక మలుపులు తిరుగుతుంది. ఒక్కసారిగా దిశను మార్చుకుని పరుగులు తీయడంతో అది ప్రాణాలతో బయట పడుతుంది. ఇతర జంతువుల మాదిరిగా చిరుత అప్పటికప్పుడు వేగం మార్చుకోలేక ఇబ్బంది పడుతుంది. అందుకే ఎక్కువ జింకలు ఉన్నప్పుడే వేటాడుతుంది.
సాధారణంగా జింకను వేటాడాలని పులులు ప్రయత్నం తక్కువగా చేస్తాయట. ఇతర జంతువులతో పోలిస్తే వాటిని వేటాడటం చాలా కష్టం. అందుకే అడవి దున్నలు, జీబ్రాలను ఎక్కువగా వేటాడే ప్రయత్నం చేస్తాయి. ఇక చిరుతకు తాను వేటాడిన ఆహారం కాపాడుకోవడం కూడా ఒక సవాల్ అనే చెప్పాలి. హైనాలు, సింహాల నుంచి చిరుత తన ఆహారాన్ని కాపాడుకోవడానికి చెట్లు ఎక్కుతుంది. భూమిపై చిరుత పులి మాత్రమే అత్యంత వేగంగా పరుగెత్తే మృగం. దీనిపై పరిశోధనలు జరిపితే చిరుత బలహీనత బయట పడింది.