మంకిపాక్స్ కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకిపాక్స్ కలకలం సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ తాజాగా హెచ్చరికలు చేసింది.
మంకీపాక్స్ అనేది మంకీపాక్స్ వైరస్ నుంచి వస్తుందని, ఇది జంతువుల నుంచి జంతువులకు, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్యం సంస్థ వెల్లడించింది. డబ్ల్యూహెచ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం….
ఈ వ్యాధి వచ్చిన వారిలో ప్రధానంగా శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తాయి. జ్వరంతో పాటు తల నొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు రెండు వారాల పాటు ఉంటాయి.
చాలా వరకు ఈ వ్యాధిసోకిన వ్యక్తుల్లో మంకిపాక్స్ లక్షణాలు కొన్ని వారాల్లో వాటంతటవే తగ్గుతాయని, కానీ కొన్ని సందర్బాల్లో మంకిపాక్స్ తో మరణం కూడా సంభవించవచ్చును.
వ్యాధి సోకిన జంతువు కరిచినా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి రక్తాన్ని, చమటను మరో వ్యక్తి తాకినా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాదిగ్రస్తులు వాడిన పాత్రలు, దుస్తులు, దుప్పట్లు ఉపయోగించినా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.