కార్లలో ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువ. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు రక్షణ కల్పించేది అవే. అసలు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడానికి ఉపయోగపడే పరికరం ఏంటో ఒకసారి చూద్దాం. మామూలుగా కార్లో ఎయిర్ బాగ్ స్టీరింగ్ వద్ద అమరుస్తారు. ఎయిర్ బ్యాగ్ వెనుక, అది ఉబ్బడానికి కావల్సిన పరికరం అమరుస్తారు.
Also Read:స్టాక్ ట్రెడింగ్ యాప్‌లకు ఇంటర్నెట్ అంతరాయం
వేగంగా వెళ్ళే కారు ఒక్కసారిగా ఏదైనా ప్రమాదానికి గురైతే దాని వేగం ఉన్నపళంగా తగ్గిపోతుంది. ఎయిర్ బ్యాగ్లు ఇలాంటప్పుడే అవసరమవుతాయి. ఉన్నపళంగా ఇలా వేగం తగ్గినప్పుడు, ఎయిర్ బ్యాగ్ లు రావడానికి తగిన పరికరం ఉండాలి. ఇందుకోసం ఏక్సిలరోమీటర్ అనే ఒక చిప్ ను ఉపయోగిస్తారు. ఎంత త్వరగా వేగం తగ్గితే అంత గొప్పగా ఫోర్స్ వస్తుంది. ఇది వేగం మార్పుని గుర్తిస్తుంది.
మామూలుగా బ్రేక్ వేసిన సమయంలో అంత ఫోర్స్ రాదూ. సరిపడా ఫోర్స్ వస్తే ఈ ఏక్సిలరోమీటర్ మరొక సర్క్యూట్ కు సిగ్నల్ రూపంలో సూచనలు వెళ్తాయి. దీనిని ఎయిర్ బ్యాగ్ సర్క్యూట్ అని పిలుస్తారు. ఇది వేడి పుట్టించే పదార్థం ద్వారా విద్యుచ్ఛక్తిని పంపిస్తుంది. ఆ పదార్థం ఒక రసాయన పేలుడు పదార్థాన్ని మండిస్తూ ఉంటాయి. పాత ఎయిర్ బ్యాగ్ లు సోడియం అజైడ్‌ను వాటి పేలుడు పదార్థంగా ఉపయోగించి ఓపెన్ అయ్యేలా చేసారు. కొత్తవి వివిధ రసాయనాలను వాడతాయి.
Also Read:వారి కోసమే నోబుల్ ఫ్రైజ్ అమ్ముకున్న…