సినిమాల్లో చూపించిన విధంగా చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందా…? కచ్చితంగా సినిమాల్లో చూపించిన విధంగా ట్రైన్ ఆగుతుంది. ట్రైనును ఆపడానికి వెస్టింగ్ హౌస్ మాడల్ ఎయిర్ బ్రేకులు పైలెట్ లు వాడతారు. బ్రేక్ కాలిపర్లు గాలి పీడనంతో చక్రాలపై ఒత్తిడిని పెంచి ట్రైనును ఆపేస్తాయి. ఈ కాలిపర్లను సాధారణ స్థితిలో 5 కి.గ్రా/చ.సెం.మీ. గాలి పీడనంతో ఓపెన్ చేసి పెడతారు.
Also Read:స్కూల్ బస్సులో బీర్ కొట్టారు.. అమ్మాయిల హల్చల్
ట్రైనుకు ఉండే చైను లాగిన సమయంలో… ఆ చైనుకు మరో వైపున ఉన్న క్లాపెట్ వాల్వు తెరచుకొని బ్రేక్ లైన్లో ఉన్న గాలి పీడనం తగ్గి… ఆ తర్వాత బ్రేకులు పనిచేసి ట్రైన్ ఆగిపోయింది. మళ్ళీ లోకో పైలట్, గార్డులు వచ్చి ఆ వాల్వును సరిచేసి గాలి పీడనాన్ని పెంచితే తప్పించి రైలు ముందుకు వెళ్ళదు. పైలెట్ కూడా ట్రైన్ బ్రేకులు వేయడానికి గాను ఇదే విధంగా బ్రేక్ లైనులో గాలి పీడనాన్ని తగ్గించడం జరుగుతుంది.
అ పీడనాన్ని కొంచెం కొంచెంగా తగ్గించడంతో ట్రైను స్లో గా ఆగుతుంది. చైను లాగినప్పుడు అలా కాకుండా హఠాత్తుగా గాలి లీక్ కావడంతో ట్రైను పెద్ద కుదుపుతో ఆగిపోయింది. వేగంగా వెళ్ళే ట్రైనులో అలా చైన్ లాగినప్పుడు లోకో పైలట్ జాగరూకతతో ఉండకపోతే మాత్రం ట్రైను పట్టాలు తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే సరైన కారణం లేకుండా చైన్ లాగడం అనేది భారతీయ రైల్వే చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
Also Read:నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం.. 30 ఏళ్లకు వెలుగులోకి..!