ఈ రోజు గూగుల్ లేకుండా మన జీవితంలో చాలా పనులు జరగడం లేదు అనే మాట వాస్తవం. గూగుల్ అనేది ప్రతీ విషయంలో అత్యంత కీలకంగా మారిపోయింది. ఇక ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలకు కూడా దాదాపుగా అందరూ గూగుల్ మీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇక ఉపాధికి గూగుల్ అనేది అత్యంత కీలకమైంది. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు సైతం గూగుల్ విషయంలో ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు.
ఏ సమస్యకు అయినా అందులో పరిష్కారం లభిస్తుంది. ఇక గూగుల్ కు డబ్బులు ఎలా వస్తాయి అనేది చాలా మందికి అవగాహన లేదు. గూగుల్ కు ఆదాయం ఏ విధంగా ఉంటుంది అంటే… ఆ సంస్థకు వచ్చే ఆదాయంలో అగ్ర భాగం… ప్రకటనల నుంచే. దాదాపుగా 80 శాతం ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రకటనలో చూద్దాం…
వెబ్సైట్ లో వచ్చే ప్రకటనలు ఉంటాయి కదా… అంటే యాడ్ సెన్స్ ఎకౌంటు ఉన్న వాళ్లకు గూగుల్ కొన్ని ప్రకటనలు ఇస్తుంది. దీనితో ఆయా సంస్థలు గూగుల్ కు చేల్లిస్తాయి. ఏదైనా సెర్చ్ చేస్తే మొదట కనపడటానికి కీ వర్డ్స్ వంటివి కూడా ఉపయోగపడతాయి. యూట్యూబ్ లో ప్రకటనల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. యాప్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంటుంది. మిగిలిన 20 శాతం ఆదాయం రావడానికి గూగుల్ క్లౌడ్ సహా కొన్ని యాప్స్ కు బ్యాక్ ఎండ్ లా ఉంటుంది గూగుల్. గూగుల్ మ్యాప్, ఏపిఐ ఊబర్, వోలా లాంటి వాటికి, గూగుల్ లెన్స్, మెషిన్ లెర్నీంగ్ ఇలా మనకు అందించే ఫీచర్స్ తో డబ్బు సంపాదిస్తుంది.