కర్పూరంకు మన దేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఎలా తయారు చేస్తారు, ఎలా ఉత్పత్తి అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. కర్పూరం అనేది చెట్ల కాండం నుండి తయారు అవుతుంది. కర్పూరం చెట్టు 40 మీటర్ల ఎత్తు పెరిగి ఆ తర్వాత వెయ్యేళ్ళ వరకు బతికే, సతత హరిత మొక్కగా చెప్తారు. ఇది టర్పెనాయిడ్ అనే రసాయనంని కూడా ఉత్పత్తి చేస్తుంది.
Also Read:ఇకపై ఆ నీటి వినియోగానికి అనుమతులు తప్పనిసరి…!
ఈ రసాయనం మనకు ఆసియాలో ఉండే” సిన్నమోనం కామ్ఫర, డ్రయనోబాలనోప్సిస్, రోజ్ మేరీ, కేంఫర్ బేసిల్ వంటి మొక్కల నుండి కూడా దొరుకుతుంది. ఇక కర్పూరం ఎలా తయారు చేస్తారంటే… కాండంపై పొర వొలవటమో ,లేక కాండాన్ని కొట్టి చిన్న చిన్న పేళ్ళులా నరికి, వాటిని పెద్ద బట్టీ లో వేసి నీటితో కలిపి, వేడి చేస్తారు. స్వేదన ప్రక్రియ ద్వారా ఆవిరి చల్ల బరుస్తారు. అలా కర్పూరాన్ని తయారు చేస్తారు. జపాన్ లో 150 ఏళ్ళ క్రితం నుంచి ఫుకుయోక ప్రాంతంలో ఉండే ఒక మిల్ లో తయారు చేస్తారు.
చెట్టు ఆకులు, పండ్ల నుండి కూడా కర్పూరం తయారు అవుతుంది. ఇక కర్పూరం గురించి తెలుసుకోవాల్సిన విషయం… మన ఇళ్ళలో తినే కర్పూరం లేదంటే పచ్చ కర్పూరం ఒకటి ఉంది. అదే విధంగా హారతి కర్పూరం దొరుకుతుంది. హారతి కర్పూరం ముద్దలా ఉంటుంది, లేదంటే బిళ్ళల మాదిరిగా ఉంటుంది. పచ్చ కర్పూరం లేదా తినే కర్పూరం పల్చటి బిళ్ళలా ఉంటుంది. చేత్తోనే మెత్తటి పొడిగా మార్చవచ్చు. హారతి కర్పూరం పొరపాటున తిన్నా సరే ఇబ్బందులు వస్తాయి.
Also Read:నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే