ఇల్లు కట్టుకునే సమయంలో నీటి కొరత లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే నీళ్ళ మీద ఆధారపడకుండా ఉండటానికి గానూ మనం బోర్ వేసుకుంటాం. బోర్ వేసుకుంటే ఎవరి అనుమతి కోసం ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడకుండా మన నీటి అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర బోర్ వేసే సమయంలో లేదా పొలాల్లో బోర్ వేసుకునే సమయంలో… నీరు ఎక్కడ ఉందో ఎలా కనుక్కుంటారు…?
Also Read:పరిశ్రమలకు పవర్ హాలీడే.. జగన్ కు పదవి హాలీడే
అదేంటో ఒకసారి చూద్దాం. నీరు అనేది ఒక విద్యుత్ వాహకం… అంటే నీటి నుంచి కరెంట్ వెళ్తుంది. అందుకే నీళ్ళల్లో కరెంట్ తీగలు ఉంటే ఆ నీళ్ళు మనం పట్టుకుంటే మరో ఆలోచన లేకుండా తాతలు కనపడతారు. అందుకే స్విచ్ వేసే సమయంలో చేతులు తుడుచుకుంటాం. అయితే భూమి మాత్రం విద్యుత్ వాహకం కాదు. భూమి మీద కరెంట్ తీగలు ఉన్నా సరే మనకు షాక్ కొట్టదు.
నీటికి, భూమి కి మధ్యలో ఉన్న ఈ వ్యత్యాస ఆధారంగానే నీటిని గుర్తిస్తారు. ఈ పద్దతిలో విద్యుత్ సహాయంలో నీళ్ళు ఉన్న ప్రదేశాన్ని కనుక్కునే పద్దతిని ఇలా విధ్యుత్ సాయం తో నీటిని కనుగొనే పద్ధతిని ‘ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్’ అని పిలుస్తాం. ఈ పద్ధతిలో రెండు ఎలెక్త్రోడ్ ల గుండా కరెంట్ ని భూమిలో కి పంపి కరెంట్ తో ఏర్పడిన సంభావ్య వ్యత్యాసం కనుక్కుంటారు. ఒహంస్ లా ఉపయోగించి రెసిస్టివిటీ కనుక్కుంటారు. తక్కువ రెసిస్టివిటీ ఉన్న ప్రదేశాల్లో నీళ్ళు ఉన్నట్టు.
Also Read:వ్యాపారంలో తేడా.. కొడుక్కు నిప్పంటించిన తండ్రి