సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారు…? వాటి రూపం చూసిన ఎవరికి అయినా సరే అది కృత్రిమంగా తయారు చేసింది, ప్రకృతి నుంచి దొరికే వాటితో కాదు అనే డౌట్ వస్తుంది. కాని అది తయారు అయ్యేది కర్ర పెండలంతో. సగ్గు బియ్యం అని చాలా ప్రాంతాల్లో అంటే రాయలసీమలో మాత్రం సబ్బియ్యమని పిలుస్తారు.
అసలు సగ్గు బియ్యం కథ ఏంటో తెలుసుకుందాం. కర్రపెండలం అనే దుంప నుంచి దాన్ని తయారు చేస్తారట. పూర్వం వరి పంట తగ్గి బియ్యం లేక కరువు వచ్చింది. అప్పుడు కేరళకు చెందిన రాజు రామవర్మ ఎంతో ముందు చూపుతో కర్ర పెండలం ను దక్షినాది ప్రజలకు దగ్గర చేసారు. ఆ తర్వాత దాని నుంచి సగ్గు బియ్యం తయారు చేసారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండే సేలం జిల్లాలో దాని తయారి జరిగింది.
సగ్గుబియ్యం తో మనం కేవలం పాయసం లేదా వేరే స్వీట్ చేసుకుంటాం. కాని కొన్ని ప్రాంతాల్లో కిచిడీ / పులిహోర రూపంలో కూడా ఉంటుంది. వాస్తవానికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో దాన్ని పవిత్రమైన వంటకంగా భావిస్తూ ఉంటారు. ఆ దుంప తవ్వి 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారు చేసే కేంద్రానికి పంపితే ఆ దుంపలను నీళ్ళల్లో శుభ్రం తొక్కను మెషిన్ తో తీస్తారు. ఆ దుంపలను మళ్ళీ కడిగి క్రషర్ లో పెట్టి పాలు తీస్తారు.
ఆ పాలు ఫిల్టర్ లోకి వెళ్లి అక్కడి నుంచి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళ్ళగా పాల లోని చిక్కని పదార్థం ముద్దలా వస్తుంది. దాంతో సగ్గుబియ్యం తయారు అవుతుంది. ఈ పిండిని పలు పరిమాణాలలో జల్లెడ లాంటి పాత్రలోకి పంపితే ఆ జల్లెడ ఊగుతూ ఉంటుంది. అప్పుడు పూసలు మాదిరి రాలి పడతాయి. అవి మెత్తగా ఉంటే వాటిని పెనంపై వేడి చేసి బయట ఆరబెడతారు. 500 కిలోల దుంపల నుండి కేవలం 100 కిలోల సగ్గు బియ్యం వస్తుంది.
Advertisements
Also Read: శ్రీహరికి, ప్రకాష్ రాజ్ కు మధ్య ఉన్న బంధుత్వం ఏంటీ…? ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా…?