యూపిఐ విషయంలో ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. చాలా మంది యూపిఐ సేవలను అన్ని విషయాల్లో వాడేస్తున్నారు. పేమెంట్ సులువుగా ఉండటంతో ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా పోయింది. ఇక ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటికి డబ్బులు ఎలా వస్తాయి అనే సందేహం చాలా మందిలో ఉంది. అసలు డబ్బులు ఎలా వస్తాయో ఒకసారి చూస్తే… ఫోన్ పే మరియు గూగుల్ పే జరిగే డబ్బు మార్పిడికి ప్రతి వెయ్యి రూపాయలకు పావలా కమీషన్ వస్తుంది.
పాతిక పైసలు వాళ్ళకి కమిషన్ ఇస్తారు అన్నమాట. ఇది కూడా యూపీఐ పేమెంట్ ని ప్రోత్సహించడానికి గాను… నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా ఇస్తున్న ఇన్సెంటివ్. అయితే ఇప్పుడు దాన్ని నిలిపివేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏ కంపెనీ అయినా యాప్ ని ఉచితంగా నడిపే అవకాశం ఉండదు. దాన్ని సంపాదించే మార్గాలను కూడా వాళ్ళు ఎంచుకుంటారు. ఫోన్ పే గూగుల్ పే మొదటి డబ్బులు మాత్రమె పంపడానికి వాడే వాళ్ళం.
Advertisements
ఇప్పుడు రీచార్జ్ లు, ఇన్స్యూరెన్స్ లు, సినిమా టికెట్ లు, హోటల్ బుకింగ్ వంటివి కూడా ఉన్నాయి. వీటి ద్వారా వాళ్లకు ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఇక వాటి ద్వారా ప్రమోషన్ చేస్తూ ఉంటాయి కొన్ని సంస్థలు. వాటి ద్వారా కూడా ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఫోన్ పే లో రీచార్జ్ చేసుకుంటే రెండు రూపాయలు కమీషన్ తీసుకుంటుంది. వంద రూపాయలు రీచార్జ్ చేసుకున్నా సరే రెండు రూపాయలు ఇవ్వాలి.