టాలీవుడ్ లో జనాలు మరువలేని హీరోల్లో ఒకరు ఉదయ్ కిరణ్. చేసిన సినిమాలు తక్కువే అయినా సరే అతను పైకి వచ్చిన తీరు, ఆ తర్వాత ఆ*&^% చేసుకున్న విధానం అన్నీ కూడా ఆశ్చర్యపరిచాయి. టాలీవుడ్ లో ఆయన ఇమడలేకపోయాడు అనే వ్యాఖ్యలు చాలానే వినిపించాయి. ఈ శతాబ్దం మొదట్లో అతను స్టార్ హీరో రేంజ్ కి వెళ్లి ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుసహిట్ లు అందుకుని 2014 లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అతను హీరోగా చేసిన మనసంతా నువ్వే సినిమాలో అతనికి చెల్లిగా నటించిన శిరీష గుర్తు ఉందా…? అప్పట్లో కొన్ని సినిమాల్లో అక్క పాత్రలలో, కొన్ని సినిమాల్లో చెల్లి పాత్రల్లో నటించిన శిరీష ఇప్పుడు సీరియల్స్ లో చేస్తున్నారు. మౌన రాగం సీరియల్ లో ఆమె నటిస్తున్నారు.
నీలవేణి పేరుతో తల్లి పాత్రలో కనపడుతున్న ఆమె ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు. ఈమె మొదట మోడలింగ్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అతడే ఒక సైన్యం, పల్లకిలో పెళ్లి కూతురు వంటి సినిమాల్లో ఆమె నటించారు.

కాని మనసంతా నువ్వే సినిమాతో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా సరే కెరీర్ లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆమె.