విభూదిని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తు ఉంటారు. శివాలయానికి వెళ్ళినా సాయి బాబా గుడికి వెళ్ళినా సరే విభూదిని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే విభూది ఎలా తయారవుతుంది అనేది చాలా మందికి తెలియదు. విభూది అంటే బూడిద అనే విషయం తెలుసు గాని అది ఎలా తయారు చేస్తారో మాత్రం తెలియదు. అసలు ఏ విధంగా తయారవుతుందో చూద్దాం.
Also Read:ఆపరేషన్ కు ముందు ఆహారం ఎందుకు వద్దంటారు…?
విభూతి అంటే భస్మమే గాని సాధారణంగా ఏ భస్మం పడితే అది పూజకు ఉపయోగించరు. కేవలం అగ్ని హోత్రం లో వచ్చిన భస్మాన్ని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అగ్ని హోత్రం లో వాడే ద్రవ్యాలు ప్రధానంగా ఆవు పిడకలు, నెయ్యి, మోదుగ పుల్లలు ,మామిడి చెక్క వంటివి ఉపయోగించి మండిస్తారు. అందులో వచ్చిన బూడిదనే భస్మ ధారణం చేస్తారు. ఈ విభూది పూర్తి తెలుపు రంగులో ఉండదు.
అయితే ఈ మధ్య కాలంలో అగ్నిహోత్రం చేసేవారు క్రమంగా తగ్గిపోవడంతో విభూది అమ్మేవారు ఎక్కువయ్యారు. వీరు అంత ఖర్చుతో శాస్త్ర ప్రకారం అంత ఖర్చుపెట్టి అవే ద్రవ్యాలతో చేయరు. విభూది కోసం హోమాలు చేయరు కదా…? బయట అమ్మేది ఏ సున్నంపొడో కలిపి తయారు చేస్తారు. అది పెట్టుకుంటే అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తమిళ్ నాట విబూదికి కాస్త క్రేజ్ ఎక్కువ. దీనితో సువాసన వచ్చే విభూది కూడా అందుబాటులోకి వచ్చింది.
Also Read:తగ్గిన బంగారం, వెండి ధరలు..!