ఎడారి అనగానే మనకు ఒంటెలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒంటెలు ఎడారుల్లో చాలా వేగంగా నడవడమే కాకుండా నీళ్ళు తాగకుండా కూడా జీవిస్తాయి అనే మాట వింటూ ఉంటాం. అసలు వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏంటీ…? నిజం చెప్పాలంటే ఒంటెలు నీళ్ళు లేకుండా 1-2 వారాలు మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ ఆహారం లేకుండా 5-6 నెలల వరకు బ్రతుకుతాయి. ఇక ఒంటె అనగానే మన కళ్ళ ముందు కనపడేది వాటి మూపురం.
Also Read:నత్త మీద ఉప్పు పోస్తే ఎందుకు చచ్చిపోతుంది…?
ఇందులో నీళ్ళు నిల్వ చేసుకుంటాయి అని అంటారు. కాని వాస్తవానికి కొవ్వు కణజాలాన్ని అక్కడ నిల్వ చేసుకుంటాయి. ఆహారం కొరత ఉన్నప్పుడు పోషణకు మూలంగా దాన్ని వాడతాయి. ఇక ఒంటెలు ఇతర జంతువుల మాదిరిగా తమ కొవ్వులను శరీరమంతా సమానంగా వ్యాపించకుండా ఈ హంప్స్‌లో నిల్వ చేసుకోవడం కాస్త ఆశ్చర్యమే. ఒంటెలు సాధారణంగా ఎడారిలో బ్రతుకుతాయి.
ఇక్కడ ఆహారం దొరకడం అనేది కష్టం కాబట్టి… ఎక్కువ కాలం ఆహారం లేకపోతే దాని శరీరం పోషణ కోసం హంప్స్‌లోని కొవ్వును జీవక్రియ చేస్తుంది. ఒంటె ఆహారం లేకుండా చాలా కాలం బ్రతుకుతూ ఉంటె… మూపురాలు కనపడవు. ఒంటె ఆహారం తిన్న తర్వాత అవి నిటారుగా ఉంటాయి. ఒంటె మూపురం దాని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కూడా సహాయం చేస్తుంది.
ఇది ఎడారి జీవికి ఒక ముఖ్యమైన లక్షణంగా చెప్తారు. పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటె రాత్రి సమయంలో చాలా తక్కువగా ఉంటాయి. మూపురం ఒంటెకు లేకపోతే మాత్రం ఒంటె శరీరం వెంటనే వేడెక్కడం మరియు చెమట పట్టే అవకాశం ఉంది. ఇక ఒంటెలు నీళ్ళు ఎక్కువ తాగడానికి సహకరించేవి వాటి రక్త కణాలు. ఓవల్ ఆకారం లో ఉండే వీటి రక్త కణాల సహకారంతో 30 గ్యాలేన్ ల వరకు నీళ్ళు తాగుతాయి.
Also Read:కాళేశ్వరానికి ఆ అర్హత లేదు!