పెళ్ళిలో తాళిబొట్టు అనేది చాలా కీలకం. తాళిబొట్టు లేకుండా పెళ్లి జరగదు. సూత్రం ఉన్నా లేకపోయినా పసుపు కొమ్ము తో అయినా సరే పెళ్లి జరగాల్సిందే కదా… పసుపు కొమ్ముతో పెళ్లి చేస్తేనే ఇంకా పవిత్రంగా ఉంటుంది అంటారు. అయితే వివాహ సాంప్రదాయ పద్ధతి ప్రకారం చూస్తే కేవలం హైందవం లోనే తాళి బొట్టు ఉంటుంది. ఇతర మతాలలో ఉంగరాలే ఉంటాయి. లేదంటే వారి వారి సాంప్రదాయ పద్దతుల ఆధారంగా ఉంటాయి.
Also Read:యాంకర్ సుమ సక్సెస్ సీక్రెట్ ఏంటీ…?
సరే అసలు తాళిబొట్టు ఎంత పొడవు ఉండాలో చూద్దాం. వాస్తవం మాట్లాడాలి అంటే ఎంత పొడవు ఉండాలి అనేది ఎక్కడా, ఎప్పుడు, ఎలానూ చెప్పలేదు. తాళి బొట్టు అన్నది సంప్రదాయములో లేదు కాబట్టి దానికి కొలతలు లేవు. స్త్రీల జీవితాన్ని నాశనం చేసే వారి నుంచి స్త్రీలను కాపాడటానికి వివాహిత అనే గుర్తు కోసం మాత్రమే తాళి బొట్టు అనేది ప్రవేశ పెట్టారు గాని… మన సాంప్రదాయాల్లో అదేమి లేదు.
మన వివాహ సంప్రదాయములో కేవలం జీలకర్ర, బెల్లం కలిపి తలమీద పెట్టటమే ఆచారం. ముహూర్తం కూడా జీలకర్ర బెల్లానికి మాత్రమే ఇస్తారు. ఇక వేదోక్తమైన వివాహ సంప్రదాయములో తాళి కొలతలు ఎక్కడా కూడా కనబడవు. అదే విధంగా వాటి ప్రత్యేకత అన్నది కూడా వివరించిన దాఖలాలు లేవు. ఉన్న వారు గొలుసు వేసుకుంటే లేని వారు పసుపు కొమ్ముతో పసుపు తాడు కట్టుకుంటున్నారు.
Also Read:డెబిట్, క్రెడిట్ కార్డుల జారీపై ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు