సినిమా పరిశ్రమలో ఒక సినిమా సరిగా హిట్ అయితే ఇక ఆ హీరోకి తిరుగు ఉండదు అనే మాట వాస్తవం. ఒక్క సినిమా తర్వాత అతను కెరీర్ ప్లాన్ చేసుకునే దాని బట్టీ ఉంటుంది. అలాంటిది సినిమా పరిశ్రమలో స్టార్ గా పైకి వస్తే… మెగా స్టార్ గా తిరుగులేని హీరోగా నిలబడితే…? చెప్పడానికి ఏముంది… పేరు ప్రఖ్యాతలు, సిరి సంపదలు అతని సొంతం. వేల కోట్లకు అధిపతి కావొచ్చు అన్నట్టు.
Also Read:కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలి
చిన్న హీరోగా మొదలు పెట్టి తెలుగు సినిమాను శాశించే స్థాయికి వెళ్ళారు చిరంజీవి. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇన్నేళ్ళ సినిమా, రాజకీయ జీవితంలో చిరంజీవి భారీగానే ఆస్తులు సంపాదించారు. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఒకప్పుడు చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఘరానా మొగుడు సినిమాకు ఆయనకు కోటి రూపాయలు ఇచ్చారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ నగరాల్లో భారీగా భవనాలు, స్థిరాస్తులు ఉన్నాయి. సినిమా పరిశ్రమ హైదరాబాద్ రాకముందు చిరంజీవి కుటుంబంతో కలిసి చెన్నై లో ఉండేవారు. అక్కడ కూడా చిరంజీవి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. ఇక హైదరాబాద్ లో విలాసవంతమైన ఫాం హౌస్ లు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో చిరంజీవి భారీగానే పెట్టుబడులు పెట్టారు.
మొగల్తూరులో హంద్రి నుంచి వచ్చిన ఆస్తిలో ఉమ్మడి వ్యవసాయ భూములు ఉన్నాయి, రంగారెడ్డి జిల్లాతో పాటుగా చెన్నై లో వ్యవసాయ భూములు ఉన్నాయి. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, కోకాపేట, ఫిలిం నగర్, మణికొండ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు ఆయన భార్య పేరు మీద కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి కార్లను బాగా ఇష్టపడుతూ ఉంటారు.
ఆయన కుమారుడు కూడా చిరంజీవికి కార్లు ఎక్కువగానే ఇస్తూ ఉంటారు. ఇక ఆయన వద్ద గాని ఆయన భార్య వద్ద గాని ఉన్న బంగారం ఆస్తుల విలువ 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. బ్యాంకు ఖాతాల్లో 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి ఆయనకు. అవన్నీ ఆ రోజుల్లో లెక్కల ప్రకారం. మరి ఇప్పుడు ఆయన ఆస్తులు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోండి.
Also read:సూపర్ హిట్ అవుద్ధనుకున్న ఎన్టీఆర్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది…?