నందమూరి బాలకృష్ణ” గత ఏడాది అఖండ సినిమా విడుదల తర్వాతి నుంచి ఈయన పేరు ఎక్కువగా వినపడుతుంది. ఆహా అనే ఒటీటీ ఫ్లాట్ ఫాం లో ఆయన చేసిన ఒక షో కి కూడా మంచి స్పందన వస్తుంది అనే చెప్పాలి. సీజన్ 2 కూడా మొదలయింది. ఇక ఆరు పదుల వయసు వచ్చినా సరే సినిమాల విషయంలో ఆయన ఎక్కడా తగ్గడం లేదు.
అఖండ ఇచ్చిన మంచి జోష్ లో ఉన్న బాలయ్య బాబు… ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య తన సొంత పేరుతో నటించిన సినిమాలు ఏడు. ఈ ఏడు సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ఇక ఆయనకు రచయితలు పరుచూరి బ్రదర్స్ తో మంచి అనుబంధం ఉంది.
బాలయ్యకు వారితో పని చేయడం కూడా సరదాగా ఉండేది. 35 సినిమాల్లో వారు కలిసి పని చేసారు. ఇక బాలకృష్ణ కెరీర్ లో కోదండ రామిరెడ్డి, కె. రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, బి. గోపాల్, బోయపాటి శ్రీనులతో చేసిన సినిమాలు మంచి రికార్డులు సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాకు టైటిల్ రెడ్డి గారు అని పెట్టారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.