ఒకప్పుడు అక్కినేని నాగార్జున సినిమాలు అంటే ఫాన్స్ కు ఒకరకంగా పిచ్చి అన్నట్టే. శివ సినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత ప్రముఖ దర్శక నిర్మాతలు అందరూ ఆయనతో సినిమాలు చేయడానికి ఎదురు చూసారు. స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే నాగార్జున మాత్రం సొంతగా పైకి వచ్చే విధంగానే కష్టపడి ముందుకు వెళ్ళారు.
Also Read:ఆ తర్వాతే జీ-23 నేతలతో సమావేశం
ఇక అది అలా ఉంచితే నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున తో పాటుగా సౌందర్య, రమ్యకృష్ణ నటించారు. ఇందులో డబుల్ రోల్ లో చేసాడు నాగార్జున. అయితే ఈ సినిమాలో నాగార్జున కు డూప్ గా నటించింది మాత్రం ఒక స్టార్ హీరో. ఆ స్టార్ హీరో ఎవరో కాదు… శ్రీకాంత్.
ఏ మాత్రం ఇమేజ్ లేని శ్రీకాంత్ ను అప్పుడు చిత్ర యూనిట్ ఆ సినిమాకు ఎంపిక చేసింది. నాగార్జున కు బిజీ షెడ్యూల్ ఉండటం తో డబుల్ రోల్ చేసే టైం లేకపోవడం తో శ్రీకాంత్ ను తీసుకున్నారు. ఈ సినిమా 1994లో విడుదలైన ‘హలో బ్రదర్’ సినిమా 70 కేంద్రాల్లో 50 రోజులు, 24 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ప్రియరాగాలే గుండె లోన పొంగుతున్న ఈ వేళ, కన్నెపిట్టరో కన్ను కొట్టరో వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
Also Read:ఆ చిత్రం నా గతాన్ని గుర్తు చేసింది : సందీపా దార్