విమానం ప్రయాణం అంటే బస్సులో కూర్చున్నట్టు విమానంలో కూర్చుని వెళ్ళడం మాత్రమే అనుకుంటారు చాలా మంది. కాని విమాన ప్రయాణంలో చాలా రకాలు ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. అందులో నాలుగు రకాలు ఉన్నాయి. అవి ఏంటీ అనేది ఒకసారి గమనిస్తే…
Also Read:పవన్ కల్యాణ్, నాని మధ్య బాక్సాఫీస్ వార్?
ఎకానమి, ప్రీమియం ఎకానమి, బిజినెస్ క్లాస్ మరియు ఫస్ట్ క్లాస్ లు.
డొమస్టిక్ విమానాల్లో ఇవేం మనకు కనపడవు గాని విదేశాలకు వెళ్ళే విమానాల్లో మాత్రం ఉంటాయి. ఫస్ట్ క్లాస్ లో చక్కనైన సీటింగ్ మాత్రమే కాకుండా మంచి ఫుడ్… మంచి డ్రింక్స్, విమానం నుంచి దిగిన తర్వాత ఉండే సేవలు అన్నీ ఇన్ని కాదు.
ఫస్ట్ క్లాస్: ఇది చాలా ఖర్చుతో కూడిన ప్రయాణం. రిక్లైనర్ కుర్చీలతో పాటుగా… ఖరీదైన ఫుడ్, పడుకోవడానికి వీలుగా చైర్స్ ఉంటాయి. లగేజీ విషయానికి వస్తే… 2×32 కిలోలు ఇంకా కావాలనుకుంటే ఇంకో 32 కేజీల బరువు తీసుకువెళ్ళే సౌకర్యం ఉంది.
బిజినెస్ క్లాస్: ఎక్జీక్యూటివ్ క్లాస్ అని పిలిచే ఈ క్లాస్ ప్రయాణంలో ఎకానమి క్లాస్ అంటే సాధారణ ప్రయాణంలో అదనపు సౌకర్యాలు, సుఖవంతమైన కూర్చునే సీటింగ్ ఉంటాయి. ఇక లగేజీలో కూడా 2×32 ,1×5 కిలోల అనుమతి ఇస్తారు.
ప్రీమియం ఎకానమి అలాగే ఎకానమి క్లాస్ లలో కొన్ని తేడాలు ఉంటాయి. ఎకానమి క్లాస్ సైజ్ సీట్లు ఉన్నా సరే… కుర్చీల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది.
ఎకానమి క్లాస్ అంటే కూర్చోవడానికి సిటీ బస్ లా ఉంటుంది. బయట రెస్టారెంట్ లో తక్కువ ధరకు దొరికే ఫుడ్ ను అక్కడ దొరకవు అని ఎక్కువ ధరకు అమ్ముతూ మనకు అందిస్తూ ఉంటారు. మన లగేజీ 2×23 కిలోలు మాత్రమే. ఒకటి క్యాబిన్ బ్యాగ్ 5 కిలోలుగా మాత్రమే.
Advertisements
Also Read:ఎక్స్ క్లూజివ్.. సత్యదేవ్ సినిమాకు భారీ ఆఫర్