బీజేపీ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో భారత్ జాగృతి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో దీక్ష చేపట్టబోతున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ప్రకటన పై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సెటైర్ వేశారు.
ముందుగా కవిత తాను తీసుకురావాల్సిన మార్పును ఇంటి నుంచే మొదలు పెట్టాలని సూచించారు. తొలుత తెలంగాణ క్యాబినెట్ లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత తన తండ్రి ని అడగాలని సూచించారు.
జడ్సన్ సోషల్ మీడియా వేదికగా కవిత ప్రకటన పై జడ్సన్ స్పందించారు. కవిత బీజేపీ మహిళలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టో లో బీజేపీ మహిళా బిల్లు పై హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు.
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మార్చి 10 న ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు.