అన్ స్టాపబుల్ కార్యక్రమం ఇప్పుడు బాలకృష్ణ అభిమానులతో పాటుగా తెలుగుదేశం అభిమానులకు మంచి వినోదం పంచుతుంది. ఈ కార్యక్రమం రెండో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి షో కి మంచి డిమాండ్ రావడంతో రెండో సీజన్ ను స్టార్ట్ చేసారు. గత ఏడాది దీపావళి సమయంలో వచ్చిన అన్ స్టాపబుల్ 1 బాగా హిట్ అయింది. రాజమౌళి, రవితేజా, మహేష్ బాబు వంటి స్టార్ లు వచ్చారు.
ఇక రెండో సీజన్ ను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేసారు ఆహా నిర్వాహకులు. అన్ స్టాపబుల్ 2 మొదటి ఎపిసోడ్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో మొదలుపెట్టారు. దీనితో టీడీపీ అభిమానులు కూడా ఆహాను సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. ఇదిలా ఉంచితే ఈ కార్యక్రమానికి బాలయ్య ఎంత డిమాండ్ చేస్తున్నారు అనే దానిపై చర్చ జరుగుతుంది. మొదటి సీజన్ సమయంలో 2.5 కోట్లు అడిగారట.
ఆ మొత్తాన్ని తన హాస్పిటల్ కు ఇవ్వాలని చెప్పారట. ఇక రెండో సీజన్ కు గానూ దాదాపు పది కోట్ల రూపాయలు డిమాండ్ చేసారని టాక్ నడుస్తుంది. వాస్తవానికి మొదటి సీజన్ హిట్ అవుతుందో లేదో అని బాలయ్య ఆచితూచి అడిగారట. కాని సూపర్ హిట్ కావడం, ఆహాకు లాభాలు భారీగా రావడంతో రెండో సీజన్ కు బాలయ్యను ఆరు కోట్లకు ఒప్పించారని తెలుస్తుంది.