టీవీ సీరియల్స్ అనేవి మన ఇండియాలో అత్యంత వినోదాన్ని ఇచ్చేవి. పల్లెటూర్లు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా మంది టీవీ సీరియల్స్ కు అలవాటు పడ్డారు. టీవీ సీరియల్స్ లో ఉండే నటుల హావభావాలను కొందరు నిజ జీవితంలో కూడా పోషిస్తూ ఉంటారు. ఇక సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్ళే వాళ్ళు అక్కడ అవకాశం లేకపోతే సీరియల్స్ లో ఛాన్స్ ల కోసం ట్రై చేస్తారు.

ఇక సీరియల్స్ ఎక్కువగా రావడంతో నటుల కొరత కూడా ఎక్కువగా ఉందనే మాట వినపడుతుంది. పెద్ద పెద్ద సీరియల్స్ లో అవకాశాల కోసం నటులు వెళ్ళడంతో చిన్న సీరియల్స్ లో చేసే నటులు కరువు అయ్యారనే మాట ఉంది. ఇక సీరియల్ లో ప్రధాన పాత్రలకు ఎపిసోడ్ కు ఇంత అని చెల్లిస్తూ ఉంటారు. మరి సహాయ నటుల పరిస్థితి, చిన్న చిన్న పాత్రలు చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుంది…??

ఒక్కసారి చూస్తే, వాళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. టీవీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు పోషించే నటులు రోజుకు సంపాదించేది కేవలం 500 రూపాయలు. రోజూ షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడకి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ పని చేసే రైటర్స్ కు ఉండే గౌరవం చిన్న నటులకు ఉండదు. అక్కడ చిన్న చిన్న పాత్రలు చేసేవారికి రోజుకు 500 ఇచ్చి టిఫిన్, మీల్స్ పెడతారు. సీనియారిటీ పెరిగి లేదా నటనలో వైవిధ్యం ఉంటేనే అయిదు వేల వరకు ఇస్తారు. ఖర్చులు తగ్గించుకోవడానికి చాలా మంది కొత్త నటులను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
Also Read: అమెరికాలో వస్తువులకు ఎమ్మాఆర్పీ ఉంటుందా…?