లతా మంగేష్కర్’ ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకుని, సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ధ్రువ తార. గాన కోకిల అనే ట్యాగ్ తో అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. వేల పాటలు పాడిన ఆమె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇక ఆమె మృతి తర్వాత ఆమె కుటుంబం గురించి ఆస్తుల గురించి చర్చ గట్టిగానే జరుగుతుంది అని చెప్పాలి.
Also Read:ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఎలుగుబంటి.. విద్యార్ధులు ఏం చేశారంటే..?
ఆమె వివాహం చేసుకోకపోవడం తో ఆమెకు చెందిన 200 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరికి చెందే అవకాశం ఉందనే దానిపై మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విలువైన ఇల్లు, కార్లు ఇలా ఎన్నో ఆమె సొంతం. దీనితో వాటిని ఎవరు తీసుకుంటారు, ఆమె తండ్రి పేరుతో ఉన్న ట్రస్ట్ ఎవరు నడుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. వాటిలో చేవ్రొలెట్, బ్యూక్, క్రిస్లర్ మరియు మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయి.
మెర్సిడెస్ ను ఒక పాట పాడినందుకు యష్రాజ్ స్టూడియోస్ నుండి బహుమతిగా పంపారు. నెలవారీ ఆదాయం రూ.40 లక్షలుగా భావిస్తున్నారు. ఆమె ఆదాయంలో ఎక్కువ భాగం ఆమె పాటల రాయల్టీల నుండి వచ్చేది. దక్షిణ ముంబైలోని పెద్దర్ రోడ్‌లో గాయకుడికి విలాసవంతమైన ఇల్లు ఉంది. దీనికి ప్రభు కుంజ్ భవన్ అని పేరు పెట్టారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ భారం మొత్తం తనపైనే వేసుకుంది. ఆమెకు ముగ్గురు చెల్లెళ్లు ఉండగా వారు ముగ్గురూ ప్లేబ్యాక్ సింగర్లే. సోదరుడు సంగీత దర్శకుడు.
Also Read:అర్జెంటినాలో చైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణం