బాలీవుడ్ జంట ఆలియా భట్- రణబీర్ సింగ్ ఒక్కటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వారి పెండ్లికి సంబంధించిన విషయాల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా పెండ్లిలో రణబీర్ ను ఆయన మరదళ్లు ఆటపట్టించిన తీరును తెలుసుకుని అందరూ నవ్వుకుంటున్నారు. అయ్యో పాపం రణబీర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..
పెండ్లిలో బావ వస్తువులను దాచిపెట్టి మరదళ్లు, బావ మరుదులు ఆటపట్టించే సాంప్రదాయం ఉంది. తాము అడిగినంత డబ్బులు కట్నంగా ఇస్తేనే ఆ వస్తువులను తిరిగి ఇస్తామంటూ బావను మరదళ్లు, బావ మరదులు ఏడిపిస్తుంటారు. ఇది పెండ్లిలో కొనసాగుతున్న సాంప్రదాయం.
రణబీర్ కపూర్ వివాహంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగింది. రణబీర్ చెప్పులను ఆయన మరదళ్లు దాచి పెట్టారు. చెప్పులు తిరిగి ఇవ్వాలంటే రూ. 11.5 కోట్లు చెల్లించాలని బావను మరదళ్లు డిమాండ్ చేశారు. చివరికి వారికి రూ. లక్షలు ఉన్న ఎన్విలాప్ కవర్ ను ఇచ్చి చెప్పులు తిరిగి తీసుకున్నాడు రణబీర్.