తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అనేది ఇప్పుడు ఒక ఘనత, చరిత్ర, సంచలనం. అందరూ ఊహించిన విధంగానే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. ఈ సినిమా గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో పలువురు శుభాకాంక్షలు చెప్తున్నారు.
ముందు ఈ సినిమాను అన్ని రకాలుగా తిట్టిన వాళ్ళు కూడా ఆస్కార్ రావడంతో సైలెంట్ అయ్యారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంచితే నాటు నాటు పాట గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ గురించి అంతర్జాతీయ మీడియా కూడా రాసిన సంగతి తెలిసిందే. ఆ పాటకు పని చేసిన డాన్స్ మాస్టర్ పై అలాగే లిరిక్ రైటర్ పై అందరూ ప్రసంశలు కురిపిస్తున్నారు.
ఇక ఆ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు అయితే మంచి క్రేజ్ వచ్చింది. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ వెళ్లి అవార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో లు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ పాట పాడిన రాహుల్ కి నిర్మాత ఎంత ఇచ్చారో తెలుసా…? 5 లక్షలు. కాని ఆ పాట పాడినప్పుడు రాహుల్ కూడా ఇంత హిట్ అవుతుంది అనుకుని ఉండడు ఏమో…?