ఏ సినిమా అయినా సరే సెన్సార్ ముఖ్యం. సెన్సార్ అయిన తర్వాతనే సినిమాను విడుదల చేస్తారు. ఒకప్పుడు సెన్సార్ ఎలా ఉండేది…? ఇప్పుడు సెన్సార్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. ఒకప్పుడు సెన్సార్ విషయంలో చాలా సీరియస్ గా ఉండేవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.
ఇప్పుడు సెన్సార్ నిబంధనలు పెద్దగా సీరియస్ గా లేవు గాని ఏవైనా కులాల గురించి మాట్లాడితే మాత్రమే సీరియస్ అయి ఆ సన్నివేశాలు వద్దని చెప్తున్నారు. పెద్దలకు మాత్రమే అయితే ‘ ఎ ‘, అందరూ చూడదగ్గవి ‘ యు ‘ మరోటి ‘ఎయు’ ..ఇలా చిత్రాలకు విభాగాలు కేటాయిస్తున్నారు. సంభాషణలు, దృశ్యాలను బట్టి సర్టిఫికెట్ ను ఇస్తారు. ఒకప్పుడు ‘ఎ ‘ సర్టిఫికెట్ చిత్రాలకు బాలలకు టికెట్లు ఇచ్చేవారు కాదు గాని… ఇప్పుడు అందరికి ఇవ్వడం జరుగుతుంది.
Also Read: టీవీలు, ఫ్యాన్ లు ఎందుకు హీట్ అవుతాయి…?
గతంలో వెధవా అనే మాట వస్తే సినిమాలో ఆ మాట లేకుండా చేసే వారు. కాని ఇప్పుడు మాత్రం తిట్లను అనుమతిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శిస్తే ఆ సన్నివేశం ఉండేది కాదు. ఇక విప్లవ భావాలు ఉండే సినిమాల మీద ఉక్కుపాదం ఉండేది. వామపక్ష భావజాలం ఉండే సినిమాల మీద నిషేధం ఉండేది. అయితే వాటిని సినిమాలో ఉంచడానికి రివ్యూ కౌన్సిల్ కు, అక్కడ సాధ్యం కాలేదు అంటే సెంట్రల్ సెన్సార్ బోర్డుకు కూడా వెళ్ళే వారు. ఆ సమయంలో వాళ్ళు అభ్యంతరాలు కాస్త వింతగా ఉండేది.
ఇప్పుడు పోలీసు ఆఫీసర్ ను నువ్వు నోరు మూయి కమీషనర్ అంటే… పోలీసులకు సమాజంలో గౌరవం ఉండదు, పోలీసులను ఎవరైనా ఎలా అయినా మాట్లాడతారు అనే భావన ఉండేది. అందుకే ఆ సన్నివేశాలు ఉంచే వారు కాదు. గత పదేళ్ళు గా అశ్లీల దృశ్యాలను, బూతులను కూడా వదిలేస్తున్నారు.
Advertisements
Also Read: నా సినిమా రిలీజ్ రోజే పవన్ సినిమాకి వెళ్తా – కిరణ్ అబ్బవరం