తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత అవకాశాల కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్క్రీన్ మీద కనపడి, ప్రజలకు నచ్చితే, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగితే ఈ రోజుల్లో వరుసగా అవకాశాలు వస్తాయనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా యాంకర్ లు గా అడుగు పెట్టి సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు గా మారిపోయారు కొందరు.
Also Read : జైచిరంజీవలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఎలా ఉందో చూడండి…!
ఇప్పటి వరకు యాంకర్ గానే కనపడుతున్న సుమా కూడా 46 ఏళ్ళ వయసుకి సినిమాలో కీలక పాత్ర పోషించడానికి రెడీ అవుతుంది. ఇలా యాంకర్ లుగా వచ్చి నటులుగా మారిన వాళ్ళ లిస్టు ఒక్కసారి చూస్తే…
సుమా కనకాల: కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని సినిమాల్లో కనపడుతున్నా తాను మాత్రం యాంకర్ గానే ఉన్నారు. కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో కనపడిన సుమా ఇప్పుడు జయమ్మ పంచాయితీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
రశ్మీ: వెండితెర కంటే బుల్లి తెర మీద బాగా అలరిస్తుంది ఈ యాంకర్. చిన్న చిన్న సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ హీరోయిన్ గా కూడా ట్రై చేస్తుంది.
అనసూయ: న్యూస్ యాంకర్ గా వచ్చి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాలో ఆమె పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది.
Also Read: అఖండ సినిమా చిన్నారితో బాలయ్య ఎలా ఉంటారు…? బోయపాటి బాగా ఎక్కడ కష్టపడ్డారు…?