తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచనల మేరకు వ్యాక్సిన్ రాగానే… దశల వారీగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ ఎలా వేయాలన్న డ్రైరన్ చేయగా… వచ్చే గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో డ్రైరన్ నిర్వహించబోతున్నారు.
వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటికీ వారంలో నాలుగు రోజులే కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. బుధ,శనివారాల్లో ఇతర వ్యాక్సిన్ లు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ కేంద్రాలతో పాటు 100కు పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాబోయే 10రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే, వ్యాక్సిన్ కావాలనే వారు కో-విన్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని, అక్కడ ఇచ్చిన డిటైల్స్ ఆధారంగా రిజిస్టర్ చేసుకున్న వారి ఫోన్ కు వచ్చే ఓటీపీ ఆధారంగా టీకా వేయనున్నారు. ఆ మెసెజ్ లోనే ఏ కేంద్రంలో మీరు వ్యాక్సిన్ పొందాలో కూడా వివరాలు ఉండనున్నాయి.