పాన్ కార్డ్ ను ఆధార్ కార్డ్ తో లింక్ చెయ్యాలి అంటూ కేంద్రం స్పష్టంగా చెప్పినా సరే కొంతమంది ఈ విషయంలో కాస్త లెక్కలేని తనంగా ఉన్నారు. కాని అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని పాన్ కార్డ్ ని ఆధార్ కార్డ్ తో కచ్చితంగా లింక్ చెయ్యాలని కేంద్రం స్పష్టంగా చెప్తుంది. పాన్ కార్డ్ ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డు వచ్చే నెల నుండి నిరుపయోగంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
పాన్‌ను ఆధార్ తో అనుసంధానించడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. అయినా కొందరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం గడువును మళ్ళీ పొడిగించకపోతే మాత్రం… పత్రాలను లింక్ చేయడానికి చివరి తేదీ 31 మార్చి 2021 అని స్పష్టంగా చెప్తున్నారు. మీ పాన్ కార్డ్ ని మీ ఆధార్‌తో అనుసంధానించకపోతే, ఏప్రిల్ 1 నుండి మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయడానికి అనుమతి లేదు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి ప్రకారం ₹ 10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. పాన్ ఎందుకు తప్పనిసరి? అనేది కూడా కేంద్రం స్పష్టంగా చెప్పింది. పాన్ కార్డు ఉండి… ఒక బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్ లేదా షేర్ ల కొనుగోలు మరియు 50 వేలకు పైగా నగదు లావాదేవీలు వంటి పలు ప్రయోజనాల కోసం తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.
పాన్ ఆధార్ కార్డు లింక్ చేయాలో ఒకసారి చూడండి. మీ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి, మీరు ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్ వెళ్ళాలి. ఎడమ వైపున ఉన్న లింక్ ఆధార్ పై క్లిక్ చేయండి.
మీరు పాన్ నంబర్, ఆధార్ నంబర్ మరియు పేరు అక్కడ ఎంటర్ చెయ్యాలి. కాప్చాలో ఫిల్ చేసిన తర్వాత…
‘లింక్ ఆధార్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది. ఆధార్ లో ఉన్న వివరాలను, అంటే మీ పేరు, పుట్టిన తేదీ మరియు లింగాన్ని ఐటి విభాగం ధృవీకరించిన తర్వాత లింక్ చేస్తారు.
ఎస్ ఎం ఎస్ ద్వారా పాన్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి అనేది ఒకసారి చూడండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 567678 లేదా 56161 కు ఎస్ ఎం ఎస్ పంపి మీ పాన్‌ను ఆధార్ నంబర్‌తో లింక్ చేయవచ్చు. మీరు UIDPAN అని టైప్ చేసి ముందు మెసేజ్ పంపాలి.
UIDPAN (12-అంకెల ఆధార్ సంఖ్య) (10-అంకెల పాన్) మరియు 567678 లేదా 56161 కు పంపండి. మీరు మీ పాన్ కార్డ్ మరియు ఆధార్‌ను మాన్యువల్‌గా లింక్ చేయాలనుకుంటే… సర్వీస్ సెంటర్ వద్దకు కూడా వెళ్ళే అవకాశం ఉంది.’అనెక్చర్- I’ ఫాం నింపాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి 20 రూపాయలు చార్జి చేస్తారు.