వేసవి కాలం వచ్చింది అంటే చాలు చాలా మందికి చెమట పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. దీనితో కాస్త చిరాకుగా ఉంటుంది. దీని కోసం అనేక రకాల సబ్బులు, క్రీం లు వాడుతూ ఉంటారు. అసలు చెమట పొక్కులు ఎందుకు వస్తాయో ఒకసారి చూద్దాం. చర్మము మీద సూక్ష్మక్రిములు ఎక్కువగా నివసిస్తాయి. ఎండ వేడి చెమటలోని నీరు, ఖనిజ లవణాలు మొదలయినవి ఉపయోగించి… త్వరితముగా వ్రుద్ది చెందుతాయి.
Also read : తెలుగు ఇండస్ట్రీ@ 50 ఇయర్స్
మనం చెమట తుడుచుకొనే ప్రయత్నంలో భాగంగా, చెమటకాయలను గిల్లే ప్రయత్నంలోనో మన చర్మంలో సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రాలు ఏర్పడి… వాటి ద్వారా చర్మంపై వృద్ది చెందే సూక్ష్మ జీవులు చర్మంలోకి వెళ్తాయి. చర్మం లోపలి పొరలలో ఇన్ఫెక్షన్ మెల్లగా పరిస్తితులు అంటే… వేడి, నీరు, ఖనిజలవణాలు, గ్లూకోజు కారణంగా వృద్ది చెంది… చెమట పొక్కులుగా పరిణామం చెందుతూ ఉంటాయి. చెమట పొక్కులకీ , చెమట కాయలకీ తేడా ఉంటుంది. చెమటకాయలలో రంధ్రం పూడిపోతుంది.
వాటిలో నీరు లేదా వేరే ద్రవం ఏదైనా ఉంటుంది. చెమట పొక్కులలో చీము ఎక్కువగా ఉంటుంది. శుభ్రంగా చన్నీటి, లేదా గోరువెచ్చటి నీటితో మురికి వదిలేలా సబ్బు/ సునిపిండి లాంటి వాటితో శుభ్రపరిచే పదార్ధముతో ప్రతి పూటా స్నానం చేసి పొడి చేనేత వస్త్రంతో తుడుచుకుని వీలైనంత గాలి తగిలే వాతావరణంలో ఉండాలి. చెమట పట్టినా సరే దాన్ని సరిగా శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రత పాటించడము ద్వారా చెమట కాయలు, చెమటపొక్కులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక చెమట శుభ్రం చేసుకునే క్రమంలో నీళ్ళు శుభ్రంగా ఉండాలి.
Also Read: డబ్బులకోసం ఇష్టం లేని పాత్రలు చేశాను:సోనాలి బింద్రే