EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్. 2019-20 సంవత్సరానికి సంబంధించిన 8.5 శాతం వడ్డీని EPF ఖాతాల్లో జమచేసింది EPFO. పీఫ్ ఖాతాదారులుగా ఉన్న ఆరు కోట్ల మంది అకౌంట్లలో ఇందుకు సంబంధించిన మొత్తం పడిపోయింది. 2019-20 సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతంగా EPFO నిర్ణయించింది. తొలుత ఇందుకు సంబంధించిన మొత్తాన్ని రెండు విడతల్లో ఇస్తామని ప్రకటించింది. ఫస్ట్ టర్మ్‌లో 8.15 శాతం, సకెండ్ టర్మ్‌లో 0.35 శాతం జమ చేస్తామని వెల్లడించింది. కాగా ఇటీవల ఒకేసారి ఆ మొత్తాన్ని ఇస్తామని ప్రకటించిన ఈపీఎఫ్‌వో… అందుకు తగ్గట్టుగానే 8.5 శాతం వడ్డీని జమ చేసింది.
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా
పీఎఫ్ బ్యాలెన్స్‌ను మొత్తం నాలుగు విధాలుగా తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్ (epfindia.gov.in), SMS, మిస్‌డ్ కాల్, UMANG యాప్ సాయంతో వివరాలు పొందవచ్చు. SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే.. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు మెస్సేజ్ పంపాలి. వెంటనే పీఎఫ్ వివరాలతో రిప్లై వస్తుంది. ఇక మిస్‌డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే.. 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వివరాలు తెలుస్తాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే SMS లేదా మిస్‌డ్ కాల్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్ కావడం తప్పనిసరి.