విమానాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. విమానాలకు ఎందుకు వైట్ కలర్ వేస్తారు… విమానాల టాయిలెట్ ల సంగతి ఏంటీ అనే దానిపై చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయి. టాయిలెట్ లకు నీళ్ళు ఎంత వరకు ఉపయోగిస్తారు ఏంటీ అనేది కూడా ఆసక్తికరమే. అసలు టాయిలెట్ ల విషయంలో ఏం జరుగుతుంది… వాటిని ఏ విధంగా క్లీన్ చేస్తారు అనేది చూద్దాం.
Also Read:తిరుపతిలో మిస్సింగ్ కేసులు కలకలం..!
విమానంలో నుంచి వ్యర్దాలు పొరపాటున లీక్ అయితే ఆ విమాన సంస్థకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి కలిగే అవకాశాలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదు. మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విమనంలోని బాత్రూములు తయారు చేస్తారు. వీటిలోని టాయిలెట్స్ లో వాక్యూమ్ సిస్టం ని వాడతారు.
ఈ వాక్యూమ్ సిస్టం టాయిలెట్ లోని వ్యర్థలను వాక్యూమ్ ద్వారా లాగేసుకుని ఒక వ్యర్దాల ట్యాంక్ లోకి పంపుతుంది. విమానం ల్యాండ్ అయ్యాక ఆ ట్యాంక్ ని ట్యాంకర్ల సాయంతో బయటకు తీస్తారు. విమాన ట్యాంకర్లలో ఎక్కువగా నీరు తీసుకువెళ్తే ఇంధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ నీటిని తీసుకు వెళ్తారు. అందుకే వ్యాక్యూం సిస్టం ను ఉపయోగించి క్లీన్ చేస్తారు.
ఫ్లష్ ట్యాంక్ లోని నీటిలో నీలి రంగులో ఉన్న ఒక లిక్విల్డ్ ను కలిపి ఫ్లష్ బటన్ నొక్కగానే క్లీన్ చేస్తుంది. ఒకవేళ వాక్యూమ్ సిస్టం బదులు నీళ్ళను వాడితే అది వ్యర్దాల ట్యాంక్ లోకి వెళ్తుంది. అయితే ఇది సమస్యకు దారి తీస్తుంది. విమానం టేకాఫ్, లాండింగ్ సమయంలో ఎక్కువ ఆక్సిలేరేషన్, డిసలేరషన్ ఫోర్స్ తో ట్యాంక్ లో ఎక్కువ స్లోషింగ్ జరిగి జాయింట్ల నుండి వ్యర్దాలు లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
Also Read:ఆర్థిక రాజధానిని వణికిస్తున్న కరోనా