మన ఇండియా లో క్రిఫ్టో కరెన్సీకి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన తక్కువగా ఉన్నా సరే దానితో వచ్చే ప్రయోజనాలను కొందరు తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక క్రిఫ్టో కరెన్సీని నార్మల్ కరెన్సీగా ఏ విధంగా మార్చుకోవచ్చో ఒక్కసారి చూద్దాం.
క్రిప్టోకరెన్సీలను ఉన్న వాళ్ళు సాధారణం కరెన్సీలోకి మార్చుకునే అవకాశం ఉందా అనే దాని ప్రశ్నలు వినపడుతుంది. మార్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు.
Also Read:వారంతా దళిత ద్రోహులే..!
మారకం
మాములుగా డీ మ్యాట్ ఎకౌంటు లోకి నగదు జమ చేసి స్టాక్ మార్కెట్ లో షేర్ లు కొని వాటిని అమ్మి ఎలా నగదు చేసుకుంటామో ఇది కూడా అంతే. మన దేశంలో WazirX, CoinSwitch Kuber వంటి మార్కెట్ లు కాస్త కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వారి యాప్ లో నమోదు చేసుకుని… ఆ ఎకౌంటు లోకి నగదు బదిలీ చేసి క్రిఫ్టో కొని దాన్ని అమ్మేసి ఆ నగదు బ్యాంకులోకి తీసుకునే అవకాశం ఉంది.
Peer-to-Peer
దీనిలో పూర్తి అనామకంగా క్రిప్టో కరెన్సీని కావలసిన కరెన్సీలోకి మార్చుకునే అవకాశం ఉంది. Hodl Hodl, LocalBitcoins, వంటి P2P ఎక్స్చేంజి మేట్ లో డైరెక్ట్ మీ కరెన్సీ ని కొనే ట్రేడర్లతో మాట్లాడి డిజిటల్ గా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.
Advertisements
Also Read:డేగల బాబ్జీ ఫస్ట్ సాంగ్ రిలీజ్