నేత్ర దానం” అన్ని దానాలలో కెల్లా ఉత్తమ దానం ఇదే. కన్ను ఉంటే ఏదైనా చేయవచ్చు గాని కన్ను లేకపోతే మాత్రం మనిషి జీవితం అంధకారమే. ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నామో కూడా అర్ధం కాదు. అందుకే నేత్ర దానం కు సంబంధించి ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. మన దేశంలో ప్రతీ ఏటా కొన్ని లక్షల మంది నేత్ర దానం చేసి చూపు ప్రసాదిస్తూ ఉంటారు. ఇక నేత్ర దానం కు సంబంధించి అవగాహానా శిభిరాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
Also read:కాంట్రవర్సీలో మంచు విష్ణు సినిమా.. టైటిల్ మార్చాలంటూ ఆగ్రహం..!
మన దేశంలో ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం కనీసం 15 లక్షల మందికి కార్నియాలు (నల్లగుడ్డు) అవసరం ఉంది. ఇక ప్రతీ ఏటా ఈ సంఖ్య 50 వేల వరకు పెరుగుతుంది. కంట్లో అన్ని భాగాలు బాగుండి… కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్ర దానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చి చూపు ప్రసాదిస్తారు. ఇక నేత్రదానం ఎలా చేయాలి ఏంటీ అనే దానిపై అవగాహన పెంచుకోవాలి.
మనం నేత్ర దానం చేయాలి అనుకుంటే… ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరించి తీసుకు వెళ్తారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం మొత్తం కూడా ఉచితంగానే జరుగుతుంది. సేకరించినవి అవసరమైన వాళ్లకు సెట్ కాకపోతే ఐ బ్యాంకు కు పంపిస్తారు. ఇక నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది.
also read: ఉక్రెయిన్ వాసులకు పొంచి ఉన్న మరో ప్రమాదం
ఆ పత్రం మీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులు సాక్షి సంతకం పెడితే వాళ్లకు గుర్తింపు కార్డు ఇస్తారు. వ్యక్తి మృతి చెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రులకు చెప్పాలి. మరణించిన ఆర గంట లోపు నేత్రాలను తీసుకోవాలి. సమాచారం తెలియగానే సంబంధిత ఆసుపత్రుల వైద్యుల బృందం అక్కడికి వెళ్లి తీసుకుంటుంది. ఇక వాళ్ళు వచ్చే వరకు మృతుని నల్లగుడ్డు ఎండకుండా చూడాలి. అంటే కళ్ళు మూసి తడి గుడ్డ పెట్టాలి. తలకింద తలగడపెట్టి తల ఎత్తుగా ఉండేలా చూడటం మంచిది. ఇక ఫ్యాన్ వేయకుండా జాగ్రత్త పడాలి. ఏసీ ఉంటే అక్కడ పెట్టవచ్చు. సేకరించిన నేత్రాలను 72 గంటల్లోపు అమర్చాల్సి ఉంటుంది.